అసలు ప్రభాస్ లైనప్ చూస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే. బాహుబలి సినిమా పై ఎంత నమ్మకంతో ఐదేళ్ల సమయాన్ని కేటాయించాడో… అంతకు మించిన స్టార్ డమ్ ని ప్రభాస్ అందుకున్నాడు. అందుకే ఈ పాన్ ఇండియా కటౌట్‌పై వేల కోట్లు కుమ్మరిస్తున్నారు మేకర్స్. ఇక డార్లింగ్ కూడా ఒకసారి కమిట్ అయితే ఎంత వరకైనా వెళ్తాడు. అందుకే బాహుబలి తర్వాత పాన్ ఇండియా క్రేజ్ వచ్చినప్పటికీ, ఇచ్చిన మాట కోసం సుజీత్‌తో సాహో, రాధాకృష్ణతో రాధే శ్యామ్ సినిమాలు చేశాడు. ఇక ఈ రెండు సినిమాలు రిజల్ట్ పక్కన పెడితే… ప్రభాస్ నెక్స్ట్ కమిట్ అయిన సినిమాలు మాత్రం ఎవ్వరి ఊహకందని విధంగా ఉన్నాయి. అసలు కెజియఫ్ డైరెక్టర్‌తో ప్రభాస్ సినిమా చేయడం ఏంటి? అది కూడా కెజియఫ్ 2 రిలీజ్‌కు ముందే షూటింగ్ స్టార్ట్ చేయడం అంటే ప్రభాస్ గ్రౌండ్ వర్క్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక నాగ్ అశ్విన్‌తో ‘ప్రాజెక్ట్ కె’ని పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా ప్రకటించి షాక్ ఇచ్చాడు. ఇదిలా ఉండగానే.. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’ అనౌన్స్ చేసి బిగ్ షాక్ ఇచ్చాడు.
ఈ లెక్కన ప్రభాస్ స్టోరీ హంటింగ్ ఎలా ఉందో ఊహించుకోవచ్చు. అయితే అన్ని భారీ సినిమాలే చేస్తున్నాను మధ్యలో ఓ మీడియం రేంజ్ సినిమా చేస్తానని.. మారుతితో ఓ సినిమా స్టార్ట్ చేశాడు డార్లింగ్. ఇక ఇప్పుడు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. ప్రభాస్‌తో సినిమా చేయబోతున్నాని చెప్పడం, సిని అభిమానులని ఎగ్జైట్ చేస్తోంది. గతంలో ప్రభాస్‌కు లోకేష్ స్టోరీ నరేట్ చేశాడని మాత్రమే వార్తలొచ్చాయి కానీ గత మూడు, నాలుగేళ్లుగా తాను ప్రభాస్‌తో టచ్‌లో ఉన్నానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఓ తమిళ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తాను ప్రభాస్‌తో చేయబోయే సినిమా ఇద్దరి కెరీర్లలోనే చాలా పెద్ద ప్రాజెక్ట్ అవుతుందని చెప్పాడు. ‘లియో’ సినిమా పూర్తిచేసిన తర్వాత ప్రభాస్ సినిమా స్క్రిప్ట్ వర్క్ మొదలుపెడతానని అన్నారు. దీంతో ఈ కాంబినేషన్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తోంది. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఏదేమైనా.. ఇది పవర్ హౌజ్ కాంబినేషన్ అని చెప్పొచ్చు.
