Site icon NTV Telugu

Project K : తాజా అప్డేట్… సెట్స్ లో ప్రభాస్ సందడి

Project-K

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు కూడా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాధే శ్యామ్” విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. “రాధే శ్యామ్” మార్చి 11న విడుదల కానుంది. ఇక ప్రశాంత్ నీల్ “సలార్”లో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కూడా నటిస్తోంది. మరోవైపు రెబల్ స్టార్ ‘ప్రాజెక్ట్ కే” కూడా చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పుడు ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సెట్స్‌లో ప్రభాస్ జాయిన్ అయినట్లు సమాచారం. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది.

Read Also : Meera Jasmine : మాస్ డైరెక్టర్ ఆఫర్… అందుకేనా ఈ అందాల ఆరబోత

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొనే హీరోయిన్. దీపికాతో పాటు అమితాబ్ బచ్చన్ కూడా ప్రస్తుత షెడ్యూల్‌లో భాగమవుతారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్, దీపికా మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట. తాజా షెడ్యూల్ రెండవది కాగా… “ప్రాజెక్ట్ కే” మొదటి షెడ్యూల్ కూడా హైదరాబాద్‌లోనే చిత్రీకరించారు.

Exit mobile version