NTV Telugu Site icon

Prabhas: రికార్డులు క్రియేట్ చెయ్యడమే హాబీగా పెట్టుకున్నాడు

Rajamouli Prabhas

Rajamouli Prabhas

మామూలుగా అయితే… ఓ పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతుందంటే… ప్రమోషన్స్ పీక్స్‌లో ఉంటాయి కానీ సలార్ విషయంలో మాత్రం అలా జరగలేదు. కనీసం ఓ ప్రెస్ మీట్ పెట్టలేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయలేదు. కేవలం రెండు ట్రైలర్లు, రెండు పాటలు మాత్రమే రిలీజ్ చేసి… డిసెంబర్ 28న సలార్‌ను థియేటర్లోకి తీసుకొచ్చారు. అయినా కూడా డే వన్ 178 కోట్ల ఓపెనింగ్స్ అందుకొని… 2023 హైయెస్ట్ ఓపెనర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది సలార్. కేవలం… ఇది ప్రశాంత్ నీల్, ప్రభాస్ క్రేజ్‌తోనే సాధ్యమైందని చెప్పొచ్చు. ఈ పవర్ హౌజ్ కాంబో అనౌన్స్మెంట్ నుంచే భారీ హైప్ క్రియేట్ చేసింది. అందుకే… మూడు రోజులకే 400 కోట్లు, 5 రోజుల్లో 500 కోట్ల మార్క్‌ను టచ్ చేసింది. ఈ మార్క్‌తో అరుదైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు ప్రభాస్. వరుసగా 5 సినిమాలతో 400 కోట్లు రాబట్టిన టాలీవుడ్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు. బాహుబలి 1, బాహుబలి 2, సాహో, ఆదిపురుష్ సినిమాల తర్వాత 400 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయింది సలార్.

ఇక బాహుబలి 1, బాహుబలి 2 తర్వాత సలార్‌తో మూడు 500 కోట్ల సినిమాలు ఇచ్చిన తెలుగు హీరోగా ప్రభాస్ నిలిచాడు. ప్రభాస్ సినిమాలు తప్పితే… టాలీవుడ్ నుంచి ట్రిపుల్ ఆర్ ఒక్కటే ఈ క్లబ్‌లో ఉంది. అది కూడా రాజమౌళి సినిమా కాబట్టి. ఇక సలార్ వెయ్యి కోట్లు రాబడితే… రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చిన హీరోగా ప్రభాస్ హిస్టరీ క్రియేట్ చేయనున్నాడు. అలాగే కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ రెండు వెయ్యి కోట్ల సినిమాలతో టాప్ లిస్ట్‌లోకి చేరనున్నాడు. ఇప్పటికే రాజమౌళి బాహుబలి2, ట్రిపుల్ ఆర్ సినిమాలతో వెయ్యి కోట్ల క్లబ్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఏదేమైనా… వందలు, వేల కోట్లు రాబట్టగల ఏకైక కటౌట్‌గా… ప్రజెంట్ ప్రభాస్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.