NTV Telugu Site icon

Prabhas: రెబల్ స్టార్ మళ్లీ రిస్క్ చేస్తున్నాడా?

Prabhas

Prabhas

బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారింది, ఈ జనరేషన్ చూసిన మొదటి పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ నిలిచాడు. డైరెక్టర్ ఎవరు అనే దానితో సంబంధం లేకుండా డే 1 రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ రాబట్టగల సత్తా ప్రభాస్ సొంతం. ఆరుకి కొంచెం ఎక్కువగా ఉన్న కటౌట్ నుంచి ఆడియన్స్ సలార్ లాంటి సాలిడ్ మాస్ సినిమాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కమర్షియల్ గా లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు ప్రభాస్ నుంచి వస్తే అవి బాక్సాఫీస్ ని క్రియేట్ చేసే హావోక్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్గెస్ట్ మాస్ హీరోగా ఉన్న ప్రభాస్, తన ఇమేజ్ ని పక్కన పెట్టి చేసిన సినిమా రాధే శ్యామ్. ఒక్క ఫైట్ లేకుండా, ప్యూర్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ప్రభాస్ ఫాన్స్ ని డిజప్పాయింట్ చేసింది. ప్రభాస్ కి ప్రస్తుతం ఉన్న మార్కెట్ ని ప్రేమ కథలు బాలన్స్ చెయ్యలేవు అనే మాటని రాధే శ్యామ్ నిజం చేసి చూపించింది. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల టైఎం లో ప్రభాస్ మార్కెట్ అండ్ క్రేజ్ కి, ఇప్పటి ప్రభాస్ మార్కెట్ అండ్ క్రేజ్ కి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. రాధే శ్యామ్ తర్వాత మళ్లీ తన ట్రాక్ ఎక్కిన ప్రభాస్… ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె లాంటి లార్జ్ స్కేల్ సినిమాలు చేస్తున్నాడు.

ఫాన్స్ కాస్త ఊపిరి తీసుకునే లోపు ప్రభాస్ మారుతీ సినిమా ఓకే చేసాడు. బాబోయ్ మారుతీతో ప్రభాస్ సినిమా చెయ్యడం ఏంటి అనుకున్నారు. రోజులు గడిచే కొద్దీ ప్రభాస్-మారుతీ కాంబినేషన్ ని ఫాన్స్ నమ్మడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇలాంటి కాంబినేషన్ ఒకటి సెట్ అవ్వడానికి రంగం సిద్ధమవుతుందని సమాచారం. అది కూడా  ఓ ప్యూర్ లవ్‌ స్టోరీ సినిమా కావడం విశేషం. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి క్లాసిక్ లవ్ స్టోరీ సినిమా ఏదైనా ఉందా అంటే.. అది ఖచ్చితంగా సీతారామం సినిమా అనే చెప్పాలి. ఈ సినిమాతో దర్శకుడు హను రాఘవపూడి క్లాసిక్ హిట్ అందుకున్నాడు. మణిరత్నంలా తెరపై ఒక ప్రేమ కథని అందంగా చూపించడంలో హను దిట్ఠ. అతని సినిమాలో మంచి పాటలు కూడా ఉంటాయి కానీ అతను ఇప్పటివరకు స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యలేదు. ప్రభాస్ కి ఉన్న పాన్ ఇండియా మాస్ ఇమేజ్ ని మర్చిపోయే రేంజులో హను మ్యాజిక్ చేస్తేనే సినిమా వర్కౌట్ అవుతుంది లేదంటే మరో రాధే శ్యామ్ అవుతుంది. మరి ప్రభాస్ ప్రేమ కథ ఏమవుతుంది? ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి.

Show comments