NTV Telugu Site icon

Darling : ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది ఆ అమ్మాయినేనట

Prabhas

Prabhas

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ లర్ ఎవరైనా ఉన్నారు అంటే అది మన డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ఫార్టీ ప్లస్ లో ఉన్న డార్లింగ్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అని అటు ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ కూడా ఎదురు చూస్తుంది. ఓ రెండేళ్ల క్రితం భీమవరానికి చెందిన రాజుల అమ్మాయిని చేసుకుంటాడని మాటలు వినిపించాయి. కానీ ఎందుకనో అది కేవలం గాసిప్ లానే మిగిలింది. ఉప్పలపాటి ప్రభాస్ నుండి గ్లోబల్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ కు చేరుకున్న ప్రభాస్ పెళ్లి కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

కాగా ప్రభాస్ పెళ్లి పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక వ్యాఖ్యలు చేసాడు. ఇటీవల రామ్ చరణ్ ఆహా లో నందమూరి బాలయ్య హోస్ట్ గా నిర్వహించే అన్ స్టాపబుల్ సీజన్ 4 లో సందడి చేసాడు. బాలయ్యతో కలిసి అనేక విషయాలు పంచుకున్నాడు.టాక్ షోలో భాగంగా రెబల్ స్టార్ ప్రభాస్ తో ఫోన్ సంభాషణ ఎపిసోడ్ కె హైలెట్ గా నిలిచింది. అయితే ప్రభాస్ ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది వెస్ట్ గోదావరి జిల్లా గణపవరం పట్టణానికి చెందిన అమ్మాయి అని అన్ స్టాపబుల్ లో రామ్ చరణ్ చెప్పి చెప్పనట్టు చెప్పాడు. స్వయంగా ప్రభాస్ ఫ్రెండ్ రామ్ చరణ్ ఈ వాఖ్యలు చేయడంతో నిజమే అయిఉండొచ్చు అనే డిస్కషన్ సోషల్ మీడియాలో జరుగుతుంది. మొత్తానికి ఈ ఏడాది డార్లింగ్ పెళ్లి పీటలు ఎక్కడమైతే గ్యారెంటీ ని ఫాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు.

Show comments