Site icon NTV Telugu

Prabhas: 12 ఏళ్ల తరువాత ప్రభాస్.. అప్పుడు నాన్న కోసం.. ఇప్పుడు పెదనాన్న కోసం

Prabhas

Prabhas

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పుట్టెడు దుఃఖంలో ఉన్న విషయం తెల్సిందే. కొన్నిరోజుల క్రితమే ఆయన దైవంలా భావించే పెదనాన్న కృష్ణంరాజు మృతి చెందిన విషయం విదితమే. ఇక ప్రస్తుతం షూటింగ్స్ ను పక్కన పెట్టి కుటుంబానికి తోడుగా ఉంటున్న ప్రభాస్ మరో రెండు రోజుల్లో తన సొంత ఊరు మొగల్తూరు వెళ్ళడానికి సిద్దమవుతున్నాడు. సెప్టెంబర్ 29 న కృష్ణంరాజు సంస్కరణ సభ.. ఆయన పుట్టిన ఊరు అయిన మొగల్తూరులో జరగనున్నవి. ఇప్పటికే ఆ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లను ప్రభాస్ సన్నిహితులు మొదలుపెట్టేశారు.

ఇక 12 ఏళ్ళ తరువాత ప్రభాస్ మొగల్తూరులో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. 12 ఏళ్ల క్రితం ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు మృతి చెందినప్పుడు సొంత గడ్డపై అడుగుపెట్టిన ప్రభాస్.. ఇప్పుడు పెదనాన్న కోసం మరోసారి సొంత నేలపై అడుగుపెడుతున్నాడట. దీంతో ప్రభాస్ కుటుంబ సభ్యులు, బంధువులు ఈ కార్యక్రమానికి హాజరుకావడానికి సన్నద్ధం అవుతున్నారని తెలుస్తోంది. ఇక పెదనాన్న సమారాధన కార్యక్రమం కోసం గ్రామంలో 70 వేల మందికి భోజనాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అక్కడ ఉన్న ఇంటికి రంగులు కూడా వేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ కు అండగా ఉండడానికి ప్రభాస్ ఫ్యాన్స్ సైతం మొగల్తూరుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version