Site icon NTV Telugu

Prabhas: “రాజా సాబ్” కోసం భీమవరంలో భారీ డిజిటల్ కటౌట్…

Prabhas

Prabhas

భీమవరం… ఉప్పలపాటి ప్రభాస్ రాజు అడ్డా. ప్రభాస్ నటించిన ఏ సినిమా రిలీజ్ అయినా, ఏ అప్డేట్ బయటకి వచ్చినా భీమవరం దద్దరిల్లిపోతుంది. ఇప్పుడు ఇలాంటిదే సంక్రాంతి పండగ రోజున జరగబోతుంది. జనవరి 15న సంక్రాంతి పండగ రోజున సూర్యుడు ఉదయించే సమయానికి భీమవరంలో ప్రభాస్ కటౌట్ నిలబడనుంది. ప్రభాస్ మారుతీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా అప్డేట్ సంక్రాంతి రోజున బయటకి రానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రివీల్ చేస్తున్న సందర్భంగా భీమవరంలోని “వెంపకాసి కోడి పందెం బరి, పెదమేరం”లో ఉదయం 6:30 నిమిషాలకి ప్రభాస్ ఎల్ఈడీ డిజిటల్ కటౌట్ కౌంట్ డౌన్ ని లాంచ్ చేస్తున్నారు.

Read Also: Sreeleela: పాపం డాన్స్ కి మాత్రమే వాడుతున్నారు… పాప టైమ్ అయిపోయినట్లేనా?

ప్రభాస్ ని వింటేజ్ మోడ్ లో చూపిస్తామని మారుతీ అండ్ ప్రొడ్యూసర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లో కనిపించిన ప్రభాస్ ని చూపిస్తే చాలు మారుతీ హిట్ కొట్టేసినట్లే. ఇదిలా ఉంటే ఈ సినిమాకి రాజా డీలక్స్ అనే టైటిల్ వినిపించింది కానీ ఇప్పుడు రాజా సాబ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారని సమాచారం. దాదాపు ఇదే టైటిల్ ని మేకర్స్ ఫస్ట్ లుక్ తో పాటు అనౌన్స్ చేయబోతున్నారట. ఇక ఈ సినిమా మ్యూజిక్ విషయంలో సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. మాకు థమన్ వద్దు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. గుంటూరు కారం సినిమా టాక్ తర్వాత థమన్ ప్రభాస్ సినిమాకి వద్దు అనే మాట మరింత ఎక్కువగా వినిపిస్తోంది. మరి ఈ విషయంలో మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి.

Exit mobile version