Site icon NTV Telugu

Project K : నెక్స్ట్ షెడ్యూల్ పై కీలక అప్డేట్

project-k

project-k

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఖాతాలో ఉన్న ఆసక్తికరమైన ప్రాజెక్టులలో “ప్రాజెక్ట్ కే” ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ భారీ బడ్జెట్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే. అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ లు కీలకపాత్రలు పోషిస్తుండగా, వీరిపై ఇప్పటికే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. సెట్స్‌పై ఉన్న ఈ సినిమా ఇప్పటి వరకూ రెండు షెడ్యూల్స్‌ని పూర్తి చేసుకుంది. ఇప్పుడు ప్రభాస్ వచ్చే వారం షూటింగ్ లో జాయిన్ అవుతారని, ఎనిమిది రోజుల పాటు హైదరాబాద్‌లో జరగనున్న ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌కి సంబంధించిన సోలో సన్నివేశాలన్నీ చిత్రీకరించనున్నట్టు సమాచారం.

Read Also : Jeevitha Rajasekhar: కోర్టుల మీద నమ్మకం ఉంది, నేను ఎటూ పారిపోలేదు!

ఇక అత్యాధునిక అర్రీ అలెక్సా టెక్నాలజీతో “ప్రాజెక్ట్ కే” నిర్మితమవుతుండగా, ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్న మొట్టమొదటి భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. ఆదిత్య 369 ఫేమ్ సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని పర్యవేక్షిస్తుండగా, డాని శాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. “ప్రాజెక్ట్ కే” తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. మరోవైపు ప్రభాస్ కిత్తిలో ఓం రౌత్‌తో “ఆదిపురుష్”, ప్రశాంత్ నీల్‌తో “సలార్”, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో “స్పిరిట్‌” ఉన్నాయి.

Exit mobile version