Site icon NTV Telugu

Prabhas First look: ప్రభాస్ ఫస్ట్ లుక్ మీద ట్రోల్స్.. మార్చి మళ్ళీ రిలీజ్ చేసిన మేకర్స్

Prabhas Project K First Look

Prabhas Project K First Look

Prabhas First look from Project K Changed by makers: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్టు K సినిమా మీద భారీ అంచనాలు అనౌన్స్ చేసినప్పటి నుంచి ఉన్నాయి. దానికి తోడు ఈ సినిమా ఒక పాన్ వరల్డ్ ప్రాజెక్టు అని నాగ్ అశ్విన్ ఆ అంచనాలను మరింత పెంచేశాడు. అలాగే అమితాబచ్చన్ దీపికా పదుకోన్, తమిళ స్టార్ హీరో కమల్ హాసన్, దిశా పటాని వంటి వారు కూడా ఈ ప్రాజెక్టులో భాగమవడంతో అంచనాలు అంతకంతకు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఆ అంచనాల నేపథ్యంలో నిన్న ప్రభాస్ ఫస్ట్ లుక్ ని సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. అయితే ప్రభాస్ లుక్ మీద దాదాపు అన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న వైజయంతి మూవీస్ సంస్థ నిన్న రిలీజ్ చేసిన లుక్ కి కొన్ని మార్పులు చేర్పులు చేసింది. అంతేకాక నిన్న రిలీజ్ చేసిన పోస్టర్లను తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి డిలీట్ చేసి దాదాపు ఉదయం 5.53 నిమిషాలకు మరొక పోస్టర్ రిలీజ్ చేశారు.

Gunasekhar: అన్యాయం జరిగితే మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఎంతవరకైనా వెళ్తా.. గుణశేఖర్ వార్నింగ్?

నిజానికి నిన్న రిలీజ్ చేసిన పోస్టర్ కి దీనికి పెద్దగా తేడా ఏమీ లేకపోయినా నిన్నటి కంటే ఈ ఫస్ట్ లుక్ బెటర్ గా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. నిజానికి నిన్నటి పోస్టర్ ఫ్యాన్ వైడ్ పోస్టర్ లా ఉందంటూ పెద్ద ఎత్తున కామెంట్లు రావడంతో సోషల్ మీడియాలో పెను దుమారమే చెలరేగింది. నాగ అశ్విన్ మీద నమ్మకం ఉన్నా ఎందుకో ఈ పోస్టర్ చూస్తుంటే తేడాగా ఉందంటూ సాధారణ సినీ ప్రేమికులతో పాటు ప్రభాస్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున టార్గెట్ చేయడంతో వైజయంతి మూవీస్ సంస్థ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మరికొద్ది గంటల్లో ప్రాజెక్ట్ కే అంటే అర్థం ఏమిటి అనే విషయం మీద పూర్తి క్లారిటీ రాబోతోంది. అమెరికాలో జరుగుతున్న శాండీ గో ఫిలిం ఫెస్టివల్ లో ఈ మేరకు అధికారికంగా రివీల్ చేయబోతున్నారు.

Exit mobile version