యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఆయన గురించి తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అయితే తాజాగా ఫుడ్ లో ప్రభాస్ ఫేవరెట్ డిష్ ఏంటో వెల్లడించింది ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఆమె భక్తి కార్యకలాపాలపై, సినిమా గురించిన దృక్పథంపై తన అనేక అభిప్రాయాలను వ్యక్తం చేసింది.
Read Also : Prabhas : సోషల్ మీడియాకు దూరం… అభిమానులకు షాక్
“కృష్ణంరాజు గారి కాలికి గాయమైనప్పటి నుంచి కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సప్త శనివార వ్రతం చేయడం ప్రారంభించాను. మరో 6 శనివారాలు ఈ వ్రతం కొనసాగుతుంది. కృష్ణంరాజు గారు భక్త కన్నప్ప, శివుడిని ఆరాధిస్తారు. నేను విష్ణువుతో పాటు పార్వతి దేవిని ఆరాధిస్తాను” అని ఆమె చెప్పింది. కృష్ణంరాజు నటన గురించి ఆమె మాట్లాడుతూ “రాధే శ్యామ్‌లో కృష్ణంరాజు గారు ఒక పాత్ర పోషించారు. షూటింగ్ మధ్యలో అతని కాలికి గాయమైంది. కానీ ఆయన ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా నటించాడు. ఆయనలో ‘పుష్ప’లో ‘తగ్గేదే లే’ డైలాగ్ లాగా…” అంటూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇక ప్రభాస్ ఆహారపు అలవాట్లకు సంబంధించిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయనకు పులస చేప అంటే చాలా ఇష్టమని చెప్పింది.
