Prabhas : ‘ఫౌజీ’ టీజర్ లోడింగ్.. సినిమా రిలీజ్ డేట్ కూడా లాక్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ వినబడుతోంది. ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ‘ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు త్వరలోనే ఒక భారీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు టాలీవుడ్ సమాచారం. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి జస్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే ఇచ్చారు. ప్రభాస్ లుక్‌ను కూడా ఫుల్ గా రివీల్ చేయకుండా కేవలం ఒక ప్రీ-లుక్ మాత్రమే బయటకు వదిలారు. దీంతో అసలైన ‘ఫౌజీ’గా రెబల్ స్టార్ ఎలా ఉంటాడనే ఎగ్జైట్మెంట్ అందరిలోనూ నెలకొంది.
వైవిధ్యభరితమైన చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాను సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకుందని సమచారం. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయడానికి చిత్రబృందం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ సర్కిల్స్ ప్రకారం ‘ఫౌజీ’ టీజర్ ను ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ చేసే ఆలోచన ఉన్నట్టు టాక్. టీజర్ విడుదలతో పాటే సినిమా ప్రమోషన్స్ వేగాన్ని కూడా పెంచాలని చిత్రబృందం భావిస్తోందట. బ్యాక్ టు బ్యాక్ పాటలు, అలాగే చిత్రంలోని కీలక పాత్రలను పరిచయం చేసే గ్లిమ్స్ వీడియోలను వరుసగా విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మరి మైత్రీ మూవీ మేకర్స్ ఈ అఫీషియల్ అప్డేట్స్ను ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి. మరోవైపు ఈ సినిమాను 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయాలని మూవీ టీం ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
Also Read
- Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
- Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్‌తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
- Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
- Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
తాజావార్తలు
-
US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్‌పోర్ట్‌కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
-
Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్.. రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు
-
Konda Surkha : సీఎం రేవంత్‌కు సురేఖ షాక్.. సంచలన డిమాండ్.!
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
-
Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!