NTV Telugu Site icon

Prabhas: ప్రభాస్ ‘ఫౌజీ’ ఫ్లాష్ బ్యాక్ కోసం.. ఆమె పై కన్నేసిన మూవీ టీం..!

February 7 (15)

February 7 (15)

ప్రభాస్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘ఫౌజీ’ ఒకటి.హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ 1940ల నాటి యుద్ధ నేపథ్యంతో పాటు, భావోద్వేగాలు కలబోసిన కథతో రాబోతుంది. ఇందుతో ప్రధాన హీరోయిన్‌గా ఇమాన్వీ ఎంపికైనప్పటికీ, చిత్రంలో ఓ కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ పార్ట్ ఉండటంతో మరో హీరోయిన్‌‌ కోసం వెతుకులాట మొదటేట్టారు మూవీ టీం. ఈ పాత్ర సినిమా కథలో కీలకంగా నిలిచేలా ఉంటుందని, ప్రభాస్ పాత్రకు కొత్త కోణం ఇవ్వబోతుందని టాక్. అందుకే ఈ ఫ్లాష్ బ్యాక్ హీరోయిన్ కోసం స్పెషల్ ఫోకస్ పెట్టారు. అయితే తాజాగా సమాచారం ప్రకారం ఈ పాత్ర కోసం ఒక హీరోయిన్ కలిసినట్లు టాక్. మరి ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే..

Also Read: Brahmanandam: బ్రహ్మనందం ఇన్‌స్టా ఎంట్రీ..క్షణాలో పెరిగిపోయిన ఫాలోవర్స్

దర్శకుడు హను రాఘవపూడి తన గత చిత్రాల్లో ఎమోషనల్ బలాన్ని ఎంత అద్భుతంగా మలిచాడో మనకు తెలిసిందే. ఇక అదే విధంగా, ఇందులో కూడా చూపించబోతున్నాడు. ఈ నేపథ్యంలో, ఈ ప్రత్యేకమైన ఫ్లాష్‌బ్యాక్ రోల్ కోసం సాయి పల్లవి పేరు పరిశీలనలో ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇంతకు ముందు దర్శకుడు ‘పడి పడి లేచే మనసు’ మూవీలో ఆమెతో పనిచేసిన అనుభవం ఉంది. దీంతో ఈసారి కూడా ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. అంతేకాదు..

తాజా సమాచారం ప్రకారం ‘తండేల్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో హను రాఘవపూడి, సాయి పల్లవి భేటీ అయ్యారని. కథ వినిపించగానే సాయిపల్లవికి ఈ పాత్ర చాలా ఆసక్తికరంగా అనిపించిందని. కానీ వెంటనే ఓకే చెప్పకూడదని ఆమె భావించినట్లు సమాచారం. ప్రస్తుతం ‘తండేల్’ ప్రమోషన్స్ పూర్తయిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇస్తానని సాయిపల్లవి చెప్పిందట. వీటన్నిటి గురించి క్లారిటీగా తెలియాలి అంటే.. అధికారికంగా ప్రకటన వచ్చేంత వరకు వైట్ చేయాల్సిందే.