Site icon NTV Telugu

Dunki: థియేటర్స్ ఇవ్వలేదని ప్రభాస్ ఫ్యాన్స్ ఆడేసుకుంటున్నారు… #SRKsDISASTERDONKEY

Dunkiii

Dunkiii

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమా అన్ని సెంటర్స్ లో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. మౌత్ టాక్ అన్ని సెంటర్స్ నుంచి బయటకు రాలేదు కానీ షోస్ కంప్లీట్ అయిన చోట మాత్రం టాక్ బాగానే ఉంది. అయితే మార్నింగ్ షో దాదాపు ఫ్యాన్స్ మాత్రమే వెళ్తారు కాబట్టి రియల్ మౌత్ టాక్ తెలియాలి అంటే మ్యాట్నీ షో వరకూ వెయిట్ చేయాలి. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో “SRKs DISASTER DONKEY” ట్యాగ్ ని ట్రెండ్ అవుతోంది. టాక్ తో సంబంధం లేకుండా “SRKs DISASTER DONKEY” ట్యాగ్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. నార్త్ లో పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ సినిమాస్ సింగల్ స్క్రీన్ థియేటర్స్ ని సలార్ సినిమాకి కేటాయించలేదు.

Read Also: Sandeep Reddy Vanga: ఏంటీ… ఈ ఇంటర్వ్యూ CGనా? మేము ఒరిజినల్ అనుకున్నామే

డంకీ సినిమాకి మాత్రమే థియేటర్స్ కేటాయించి సలార్ కి ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ జరగలేదని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో షారుఖ్ ఖాన్ తన మాఫియాని వాడి సలార్ కి థియేటర్స్ మిస్ అయ్యేలా చేసాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ కోపంతోనే ప్రభాస్ ఫ్యాన్స్ డంకీ సినిమాపై నెగటివ్ ట్రెండ్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు, గతంలో డంకీ సినిమాని డాంకీ అనే ట్రెండ్ ని కూడా చేసారు. మరి డంకీ సినిమా షారుఖ్ ఖాన్ కి హ్యాట్రిక్ ఇచ్చిందా లేక బాక్సాఫీస్ దగ్గర గోవిందా కొట్టిందా అనేది తెలియాలి అంటే ఈరోజు మ్యాట్నీ కంప్లీట్ అయ్యే వరకూ ఆగాల్సిందే.

Exit mobile version