NTV Telugu Site icon

Prabhas Fans: మీ కష్టం ఎవరికీ రాకూడదు మావా… దర్శక నిర్మాతలు ఏమైపోయారో

Adipurush

Adipurush

ఈ జనరేషన్ ఇండియన్ బాక్సాఫీస్ చూసిన మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ గా మారిన ప్రభాస్ ఫాన్స్ కి ఉన్నంత ఓపిక ఏ హీరో ఫాన్స్ కి ఉండదని చెప్పడం అతిశయోక్తి కాదు. బాహుబలి సినిమా చేస్తే అయిదేళ్లు, సాహూ మూడున్నర ఏళ్లు, రాధే శ్యామ్ దాదాపు రెండేళ్లు… ఇలా ప్రభాస్ తో ఏ దర్శక నిర్మాత సినిమా చేసినా దానికి ఏళ్ల తరబడి సమయం పడుతుంది. సంవత్సరాల తరబడి ప్రభాస్ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఒక్కోసారి ఫాన్స్ లో సహనం పూర్తిగా నశించిపోయి సోషల్ మీడియాలో అప్డేట్ కావాలి అంటూ రచ్చ చేస్తుంటారు. దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో యువీ క్రియేషన్స్ కి బాగా తెలుసు. మరోసారి తమ సత్తా ఏంటో చూపించడానికి ప్రభాస్ ఫాన్స్ రెడీ అవుతున్నారు. మార్చ్ 30న శ్రీరామ నవమి పండగ సందర్భంగా భారి సెలబ్రేషన్స్ ని ప్రభాస్ ఫాన్స్ ప్లాన్ చేశారు.

ఆదిపురుష్ సినిమా నుంచి శ్రీరామ నవమికి అప్డేట్ వస్తుందని ఫాన్స్ ఆశిస్తున్నారు కానీ మేకర్స్ నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. మరో నాలుగు నెలల్లో సినిమా రిలీజ్ అవుతుంది అనే ఆలోచన కూడా లేకుండా జీరో ప్రమోషన్స్, జీరో బజ్ ని సక్సస్ ఫుల్ గా మైంటైన్ చేస్తున్నారు ఆదిపురుష్ మేకర్స్. మేకర్స్ కి కూడా షాక్ ఇచ్చే రేంజులో ఆదిపురుష్ ప్రమోషన్స్ ని ప్లాన్ చేసిన ప్రభాస్ ఫాన్స్ మార్చ్ 30న సుదర్శన్ థియేటర్ లో 50 అడుగుల కటౌట్ పెడుతున్నారు. బైక్ ర్యాలీ, ఫుడ్ డొనేషన్స్ ని కూడా ప్రభాస్ ఫాన్స్ గ్రాండ్ స్కేల్ లో చెయ్యడానికి రెడీ అయ్యారు. శ్రీరామ నవమి పండగ రోజు ప్రభాస్ ఫాన్స్ చేసే సెలబ్రేషన్స్ చూసి అయినా ఆదిపురుష్ మేకర్స్ మేలుకోని ప్రమోషన్స్ ని మొదలుపెడతారేమో చూడాలి.

Show comments