Site icon NTV Telugu

Radheshyam : థియేటర్ వద్ద అపశృతి… ప్రభాస్ ఫ్యాన్స్ కు తీవ్ర గాయాలు

Radheshyam

ఈరోజు “రాధేశ్యామ్” థియేటర్లలోకి వస్తుండడంతో ఫుల్ గా సందడి నెలకొంది. ఏ థియేటర్ వద్ద చూసినా ప్రభాస్ అభిమానులు హంగామా కన్పిస్తోంది. దాదాపు మూడేళ్ళ తరువాత ప్రభాస్ థియేటర్లలోకి ఓ పాన్ ఇండియా లవ్ స్టోరీతో వస్తుండడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. థియేటర్ల వద్ద ప్రభాస్ భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఓ థియేటర్ వద్ద అపశృతి నెలకొంది. ఆ ప్రమాదంలో ప్రభాస్ ఫ్యాన్స్ కు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది.

Read Also : Prabhas and Rajamouli Chit Chat : పూజని పక్కన పెట్టేసిన ప్రభాస్

కారంపూడిలోని ఐమ్యాక్స్ థియేటర్ వద్ద గురువారం రాత్రి ప్రమాదం జరిగింది. శుక్రవారం సినిమా విడుదల సందర్భంగా 37 ఏళ్ల చల్లా కోటేశ్వర రావు అనే వ్యక్తి ఫ్లెక్సీ కడుతుండగా ఘటన చోటు చేసుకుంది. “రాధేశ్యామ్” సినిమా ఫ్లెక్సీ పడుతుండగా, హఠాత్తుగా అది విరిగి పక్కనే ఉన్న కరెంట్ తీగలపై పడింది. దీంతో ఫ్లెక్సీని పట్టుకుని ఉన్న కోటేశ్వర రావు విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ సంఘటనలో మరో ఇద్దరికి కూడా గాయాలైనట్టు సమాచారం. వెంటనే వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Exit mobile version