Prabhas Fans Demanding Salar First Single Update: బాహుబలి తర్వాత ప్రభాస్ ఒక సాలిడ్ హిట్ కొడితే చాలని కాలర్ ఎగరేసుకుని తిరుగుతాం అంటున్నారు ఆయన అభిమానులు. నిజానికి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న, ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా దెబ్బకు సోషల్ మీడియా షేక్ అయిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ సినిమా మీద ఉన్న అంచనాలు ఒక రేంజ్ లో ఉండడంతో రిలీజ్‌కు ముందే ఎన్నో రికార్డులు సృష్టిస్తోంది ఈ సలార్. జూలై 6న రిలీజైన సలార్ టీజర్ యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. రెండు రోజుల్లోనే 100 మిలియన్ల వ్యూస్ రాబట్టి కొత్త రికార్డు సెట్ క్రియేట్ చేసింది. ఇదే జోష్‌లో ఆగస్టులో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేస్తామని కూడా ప్రామిస్ చేశారు మేకర్స్. అయితే ట్రైలర్ కంటే ముందే.. సలార్ ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు రెడీ అవుతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా ఇప్పటికీ అధికారిక అప్డేట్ అయితే లేదు.
Bhola Shankar Censor: భోళా శంకర్ సెన్సార్ రివ్యూ.. సభ్యులు ఏమేం సూచనలు చేశారంటే?
ఇక ఇదే విషయాన్ని గుర్తూ చేస్తూ.. ఇప్పుడు ట్విట్టర్లో #SalaarFirstSingle ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరో యాభై రోజుల్లో సలార్ రిలీజ్ కాబోతోంది, ఇప్పటికీ అప్డేట్ లేదు కాబట్టి మాకు ఫస్ట్ సింగిల్ అప్డేట్ కావాలని ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఏ క్షణమైనా సలార్ టీమ్ నుంచి సాంగ్ అప్డేట్ రావొచ్చనే న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 15న సలార్ ఫస్ట్ సింగిల్ బయటికొచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ సినిమాకు కెజిఎఫ్ సిరీస్ ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా సలార్ మ్యూజిక్ ఆల్బమ్ పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రవి బస్రూర్ అదిరిపోయే మాస్ ట్యూన్స్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే.. సలార్ కోసం పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడని అంటున్నారు. అలాగే ట్రైలర్ కంటే ముందు ఫస్ట్ సింగిల్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.