NTV Telugu Site icon

Prabhas: రెబల్ ఫ్యాన్స్ ని భయపెడుతున్న థమన్… సంతోష్ నారాయణన్…

Prabhas

Prabhas

సలార్ సీజ్ ఫైర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు ప్రభాస్. 750 కోట్లు రాబట్టిన ప్రభాస్ కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇక నెక్స్ట్ కల్కి 2898 సినిమాతో మే 9న ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు ప్రభాస్. ఈ మూవీతో పాటు ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా “ది రాజా సాబ్” కూడా జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ రెండు సినిమాలకి సంబంధించిన ఇద్దరు టెక్నీషియన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్నారు. కల్కి 2898 సినిమాకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ డైరెక్టర్, రాజా సాబ్ సినిమాకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడు. ఈ ఇద్దరూ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ని కలవరపెడుతున్నారు.

2024 సంక్రాంతి రిలీజైన సినిమాల్లో గుంటూరు కారం సినిమాకి థమన్ మ్యూజిక్ ఇచ్చాడు. సైంధవ్‌ సినిమాకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ ఇచ్చాడు. మాములుగా అయితే మంచి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా పేరున్న ఈ ఇద్దరూ సంక్రాంతి సినిమాలకి సోసో గానే మ్యూజిక్ కొట్టారు. గుంటూరు కారం, సైంధవ్‌ సినిమాలకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో నెగేటివ్స్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీంతో థమన్ అండ్ సంతోష్ నారాయణన్ లు ప్రభాస్ సినిమాలకి ఎలాంటి మ్యూజిక్ ఇస్తారో అనే డౌట్ ఫ్యాన్స్ లో మొదలయ్యింది. సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య వేడివేడిగా ఈ విషయంపై చర్చ జరుగుతోంది. మరి థమన్ అండ్ సంతోష్ నారాయణన్ లు ప్రభాస్ కి ఎలాంటి మ్యూజిక్ ఇస్తారు అనేది చూడాలి. అయితే థమన్ ఇప్పటికే ప్రభాస్ సాహూ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చి ప్రభాస్ ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేసాడు కాబట్టి ఈసారి కూడా అదే రేంజ్ స్కోర్ కొడితే థమన్ నుంచి సూపర్ వర్క్ వచ్చేసినట్లే.