NTV Telugu Site icon

Prabhas: అంతా ఆదిపురుష్ మయం… ఇంకో టాపిక్ లేదు

Prabhas

Prabhas

జూన్ 16న ఆదిపురుష్ సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రామాయణం ఆధారంగా తెరకెక్కింది. శ్రీరాముడిగా ప్రభాస్ నటిస్తూ ఉండగా, సీతాదేవిగా కృతి సనన్ నటిస్తోంది. గత మూడు నెలలుగా ఆదిపురుష్ సినిమా టాప్ ట్రెండింగ్ లోనే ఉంది. పోస్టర్, జై శ్రీరామ్ సాంగ్, ట్రైలర్… ఇలా బయటకి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆదిపురుష్ సినిమాపై అంచనాలని పెంచాయి. ముఖ్యంగా జైశ్రీరామ్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది, 100 మిలియన్ వ్యూస్ కి పైగా రాబట్టిన ఈ ఒక్క పాత ఆదిపురుష్ బిజినెస్ తల రాతనే మార్చేసింది. భయంకరమైన నెగిటివిటీ ఫేస్ చేస్తున్న ఆదిపురుష్ సినిమా ఈరోజు ఇంత హైప్ క్రియేట్ చేసింది అంటే దానికి కారణం జై శ్రీరామ్ సాంగ్. మరో మూడు వారాల్లో ఆడియన్స్ ముందుకి రానున్న ఆదిపురుష్ నుంచి అంచనాలని మరింత పెంచుతూ ‘రామ్ సియా రామ్’ సాంగ్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి రిలీజ్ కానుంది. సాంగ్ రిలీజ్ అంటే అదేదో యుట్యూబ్ లింక్ ఇచ్చేసి చూడమన్నట్లు కాదు.

మూవీ ఛానెల్స్, మ్యూజిక్ ఛానెల్స్ తో పాటు జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ నుంచి దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 70కి పైగా రేడియో స్టేషన్స్, నేషనల్ మీడియా, అవుట్ డోర్ బిల్ బోర్డ్స్, మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్, టికెటింగ్ పార్టనర్స్, సినిమా థియేటర్స్, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ తో పాటు అన్ని ప్రధాన సోషల్ మీడియా వేదికలపై మధ్యాహ్నం 12గంటలకు ‘రామ్ సియా రామ్’ పాటను ఒకే సమయంలో ఒకేసారి వినిపించబోతున్నారు. అంటే ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్స్ అండ్ లైవ్ పెర్ఫార్మెన్స్ లో ‘రామ్ సియా రామ్’ సాంగ్ ఒకేసారి ప్లేకానుందన్నమాట. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో ఈ సాంగ్ ని సచేత్ – పరంపర కంపోజ్ చెయ్యడంతో పాటు వారే పాడడం విశేషం. జై శ్రీ రామ్ సాంగ్ ని అద్భుతమైన లిరిక్స్ రాసిన రామజోగయ్య శాస్త్రి “రామ్ సియా రామ్” సాంగ్ కి కూడా అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఈ సాంగ్ ని వినడానికి ప్రభాస్ ఫాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.