Site icon NTV Telugu

Prabhas FB Hacked: బిగ్ బ్రేకింగ్.. ప్రభాస్ ఫేస్ బుక్ పేజ్ హ్యాక్.. ఆ పోస్టు షేర్ చేసి?

Prabhas Movie

Prabhas Movie

Prabhas facebook page hacked: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మామూలుగానే సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్ గా ఉంటారు. అయితే ఆయన టీం మాత్రం ఆయన సోషల్ మీడియా అకౌంట్లను యాక్టివ్గా ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజానికి ప్రభాస్ ఈ మధ్యనే ట్విట్టర్ లో ఎంట్రీ కూడా ఇచ్చారు. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా ప్రభాస్ తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. అయితే ముందు నుంచి ప్రభాస్ కి సోషల్ మీడియాలో ఫేస్బుక్ పేజ్ ఉండేది. ఇండియా వైడ్ అభిమానులు ఉండడంతో ప్రభాస్ ఫేస్బుక్ పేజ్ కి ఫాలోవర్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆయనకు ఫేస్బుక్ పేజీలో దాదాపు 24 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే కొద్దిసేపటి క్రితం స్టార్ హీరో ప్రభాస్ వాడుతున్న ఫేస్బుక్ పేజీ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. ఆయన ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఒక వీడియోను కూడా షేర్ చేశారు.

Vivek Agnihotri: ప్రభాస్‌తో నాకు పోలికేంటి? ఎవడ్రా రాసింది ఇది?

‘humans being unlucky’ పేరుతో ఒక వీడియో షేర్ చేయగా ఆ వీడియో షేర్ చేసిన కొద్దిసేపటికి ప్రభాస్ టీం స్పందిస్తూ ఆయన ఫేస్బుక్ పేజీ నుంచి ఆ పోస్ట్ డిలీట్ చేసింది. నిజానికి గతంలో కూడా పలువురు సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లను హ్యాకర్లు హ్యాక్ చేసి వాటి నుంచి ఇబ్బందికరమైన అసభ్యకరమైన పోస్టులు షేర్ చేసేవారు. అయితే ప్రభాస్ ఫేస్బుక్ పేజీ నుండి షేర్ చేసిన కంటెంట్ సైంటిఫిక్ కంటెంట్ లా అనిపించడంతో కొంత మంది ప్రాజెక్ట్ కే సినిమాకు సంబంధించిన అప్డేట్ అని కూడా భావించారు. కానీ అది హ్యాకర్ల పని అని తెలియడంతో వెంటనే ప్రభాస్ టీం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే ప్రభాస్ టీమ్ స్పందిస్తూ ఆ పోస్ట్ ను సోషల్ మీడియాలో నుంచి తొలగించారు. అయితే అప్పటికే స్క్రీన్ షాట్లు తీసిన కొంతమంది నెటిజన్లు ప్రభాస్ అకౌంట్ హ్యాక్ అయిందా ఏంటి అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు.

Exit mobile version