ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు చిత్ర పరిశ్రమ తమ వంతు సాయం చేస్తూ ఉంటుంది.. ప్రకృతి వైపరీత్యాల వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు టాలీవుడ్ మొత్తం ఒక్కటిగా వారికోసం నిలబడతారు..ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో వరదల కారణంగా ఎన్నో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.. ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు, చిత్తూరు ప్రాంతాలు వరద ధాటికి కొట్టుకుపోయాయి.ఈ విపత్తు కారణంగా కోట్లాది రూపాయలు నష్టపోయారు ప్రజలు, ప్రభుత్వం. వాళ్లను ఆదుకోడానికి ఏపీ గవర్నమెంట్ కూడా తమదైన సాయం చేస్తున్నారు.
ప్రభుత్వానికి అండగా మేము సైతం అంటున్నారు టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు తమవంతు సాయంగా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి రూ . 25 లక్షలు అందించిన విషయం తెలిసిందే. తాజాగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సైతం తనవంతు సాయంగా కోటి రూపాయలు విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభాస్ కి ఇదేమి కొత్తకాదు గతంలో కరోనా సమయంలో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి రూ . 4.5 కోట్లు విరాళంగా ఇచ్చాడు. దీంతో ప్రభాస్ గొప్ప మనసుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. డార్లింగ్ అంటే డార్లింగ్ అంటూ ప్రభాస్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
