‘బాహుబలి’ మూవీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్ రెంజ్.. క్రేజ్ ఎలా పెరిగిపోయిందో చెప్పక్కర్లేదు. కానీ, ఆ తర్వాత వచ్చిన సినిమాలు నిరాశనే మిగిల్చాయి. ఇక ‘సలార్’ హిట్ తో ఖుషీలో ఉన్నా ఆయన ఫ్యాన్స్.. ‘కల్కీ 2898 ఏడీ’ సినిమా భారీ విజయం సాధించడంతో పండగ చేసుకున్నారు. కాగా ప్రస్తుతం ప్రభాస్ చేతిలో వరుస ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ‘రాజాసాబ్’, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో ‘స్పిరిట్’, ‘కల్కీ 2898 ఏడీ పార్ట్ – 2’ ఇలా వరుస పెట్టి చూసుకుంటే అరడజను పైనే సినిమాలు లైన్ లో పెట్టాడు ప్రభాస్. అయితే ఇందులో విడుదలకు సిద్ధంగా ఉన్న మూవీ అంటే ‘ది రాజా సాబ్’.
Also Read: Pahalgam Attack incident : ఉగ్రవాద దాడి ఎఫెక్ట్.. పాక్ యాక్టర్స్ మీద బ్యాన్
మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్నా ఈ మూవీని పూర్తి హార్రర్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు మేకర్స్. దీంతో ఇప్పటికే ప్రేక్షకులో ఈ మూవీ పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ప్రభాస్ సరసన మాలవిక మోహన, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. గతంలో ఏప్రిల్ 10న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. కానీ, ఈ సినిమా పనుల్లో ఆలస్యం అవుతుండటంతో ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. అయితే, తాజాగా ఈ సినిమా రిలీజ్‌పై దర్శకుడు మారుతి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఓ ఆటోరిక్షాపై రాజాసాబ్‌లోని ప్రభాస్ ఫోటో ఉండటాన్ని ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోకు ఆయన ‘అలర్ట్.. వేడి గాలులు మే లో మరింత పెరగనున్నాయి’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో త్వరలోనే ‘రాజా సాబ్’ నుంచి ఓ సాలిడ్ అప్డేట్ అయితే రానుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
