Site icon NTV Telugu

Prabhas: 23 ఏళ్లు.. ట్రెండింగ్‌లో ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్’!

Prabhas

Prabhas

ప్రస్తుతం ‘ప్రభాస్’ అంటే ఒక బ్రాండ్. ఆయన సినిమాలు థియేటర్లోకి వస్తే.. కోట్ల వర్షం కురుస్తుంది. తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి చేర్చిన హీరోగా ప్రభాస్ చరిత్రలో నిలిచిపోయారు. అలాంటి డార్లింగ్ సరిగ్గా 23 ఏళ్ల క్రితం నవంబర్ 11న హీరోగా సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రి ఇచ్చారు. ప్రభాస్ నటించిన మొదటి సినిమా ఈశ్వర్ 2002 నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆనాడు మొదలైన ప్రభాస్ జర్నీ.. టాలీవుడ్ నుండి పాన్ ఇండియా, రీజనల్ నుండి వరల్డ్ సినిమా, రెబల్ స్టార్ నుండి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ వరకు తీసుకెళ్లింది.

ఈశ్వర్ తర్వాత ‘రాఘవేంద్ర’, ‘వర్షం’, ‘అడవిరాముడు’, ‘చక్రం’, ‘ఛత్రపతి’, ‘పౌర్ణమి’, ‘యోగి’, ‘మున్నా’ ‘బుజ్జిగాడు’ ‘బిల్లా’, ‘ఏక్‌నిరంజన్‌’, ‘డార్లింగ్‌’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’, ‘రెబల్‌’, ‘మిర్చి’ వరకు ప్రభాస్ జర్నీ ఒక ఫేజ్ అయితే.. బాహుబలితో పాన్ ఇండియా జర్నీ మొదలైంది. ఈ సినిమా నుంచే పాన్ ఇండియా సినిమాలకు పునాది పడింది. ఇక బాహుబలి తర్వాత సాహో, సలార్, కల్కి 2898ఎడి సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించారు. ప్రస్తుతం భారీ పాన్ ఇండియా సినిమాలు లైనప్ చేసుకున్న ప్రభాస్.. రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2తో పాటు ఇంకొన్ని ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు.

Also Read: Killer Doctors: కిల్లర్ డాక్టర్లు.. కారు పేలుడులో ఆ నలుగురి భాగస్వామ్యం ఇలా!

అయితే ఇప్పటి వరకు రెబల్ స్టార్‌గా ఉన్న ప్రభాస్‌కు.. స్పిరిట్ సినిమాతో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌ ట్యాగ్ ఇచ్చాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. దీంతో రెబల్ స్టార్ టు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ఫాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. అయితే బాలీవుడ్‌లో బడా బడా ఖాన్‌లు ఉండగా.. ప్రభాస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎలా అవుతాడు? అంటూ కొందరు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ ట్రాక్ రికార్డ్, బాక్సాఫీస్ లెక్కలు, హైయెస్ట్ కలెక్షన్స్, ఫస్ట్ డే ఓపెనింగ్స్ చూస్తే.. ఆయనే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు.

Exit mobile version