సిల్వర్ స్క్రీన్ పై ప్రభాస్‌ను రాముడిగా ఎప్పుడెప్పుడు చూస్తామా.. అని ఎదురు చూసిన ప్రభాస్ ఫ్యాన్స్.. ఇప్పుడు శ్రీరాముడిని థియేటర్లో చూసి పండగ చేసుకుంటున్నారు. ఇక ఆదిపురుష్ సినిమాతో.. ప్రభాస్ ఆలిండియా డే 1 ఓపెనింగ్స్ రికార్డ్ క్రియేట్ చేసినట్టేనని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఓం రౌత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఆదిపురుష్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా కృతి ససన్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించాడు. దాదాపు 550 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌తో బక్సాఫీస్ బరిలోకి దిగింది. అందుకు తగ్గట్టే.. ఆదిపురుష్ బాక్సాఫీస్ లెక్కలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా ఆదిపురుష్ డే వన్ కలెక్షన్స్ 150 కోట్లు క్రాస్ చేయడం పక్కా అని అంటున్నారు. దీంతో ప్రభాస్ ఖాతాలో మరో వంద కోట్ల సినిమా పడిపోయినట్టే. అంతేకాదు.. వంద కోట్ల సినిమాలతో ప్రభాస్ ఆల్ ఇండియా రికార్డ్ క్రియేట్ చేసినట్టవుతుంది.
ఇప్పటి వరకు తొలి రోజు దాదాపు వంద కోట్ల గ్రాస్ దక్కించుకున్న సినిమాలు… ఇండియా వైడ్‌గా ఆరు మాత్రమే ఉన్నాయి. బాహుబలి 2, సాహో, రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్, కెజియఫ్ చాప్టర్ 2, పఠాన్ సినిమాలు ఈ ఎలైట్ లిస్టులో ఉన్నాయి. ఈ ఆరు సినిమాల్లో మూడు వంద కోట్ల ఓపెనింగ్ తెచ్చిన సినిమాలు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌వే కావడం విశేషం. ఇక ఇప్పుడు ఆదిపురుష్.. డే వన్ వంద కోట్లు రాబట్టిన 7వ సినిమాగా రికార్డులు కొల్లగొట్టబోతోంది. ఈ లెక్కన నాలుగు సినిమాలతో… ఫస్ట్ డే వంద కోట్ల క్లబ్‌లో ఉన్న ఏకైక హీరోగా ప్రభాస్ ఆల్ ఇండియా రికార్డ్ సెట్ చేసినట్టే. ఇదే కాదు ఆదిపురుష్‌తో ప్రభాస్ పేరిట ఎన్నో సరికొత్త రికార్డులు క్రియేట్ అవబోతున్నాయి.