బాహుబలికి ముందు టాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న ప్రభాస్.. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక ఇప్పుడు డార్లింగ్ చేస్తున్న సినిమాలు చూస్తుంటే.. రానున్న రోజుల్లో పాన్ వరల్డ్ స్టార్‌గా మారడం పక్కా అంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ చేతిలో భారీ బడ్జెట్ సినిమాలు ఉండగా.. ఇప్పుడు మరో బాలీవుడ్ సినిమాకు కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. మరి ఆ సినిమా ఎప్పుడు రాబోతోంది.. డైరెక్టర్ ఎవరు.. ఆ వార్తల్లో ఎంతవరకు నిజముంది..?
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అలాగే స్పిరిట్, మారుతి సినిమాలు ప్రారంభం కావాల్సి ఉంది. మొత్తంగా ప్రభాస్ ఐదు ప్రాజెక్ట్ లు లైన్లో పెట్టాడు. అయితే ఇవన్నీ ఉండగానే.. తాజగా ప్రభాస్ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలుస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ అనౌన్స్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఆది పురుష్. ఎందుకంటే.. బాహుబలి టైంలోనే సాహో, రాధే శ్యామ్ సినిమాలు కమిట్ అయ్యాడు కాబట్టి.. బాహుబలి2 తర్వాత ప్రభాస్ ఓకే చెప్పిన ప్రాజెక్ట్ బాలీవుడ్ సినిమా అనే చెప్పొచ్చు. ఇక ఈ సినిమానే ఇప్పుడు అన్నింటికంటే ముందుగా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉండగానే.. ప్రభాస్ ఇప్పుడు మరో బాలీవుడ్ దర్శకుడితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఒక పక్కా కమర్షియల్ మూవీ రాబోతోందని.. ఏడాది క్రితమే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అవన్నీ పుకార్లే అనుకున్నారు. కాని తాజాగా ప్రభాస్-సిద్దార్థ్ ఆనంద్ కాంబో ఫిక్స్ అయిందని.. ఆ సినిమాను తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాని స్టార్ట్ చేయబోతున్నట్టు టాక్. ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్.. బాలీవుడ్ లో షారూఖ్ ఖాన్‌తో ‘పఠాన్’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అలాగే హృతిక్ రోషన్‌తో ‘ఫైటర్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక ప్రభాస్ సినిమా ఉంటుందట. అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే.. మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
