Site icon NTV Telugu

Unstoppable 2: ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో చెప్పండి సార్… బెస్ట్ ఎపిసోడ్ టిల్ డేట్

Unstoppabale

Unstoppabale

నందమూరి బాలకృష్ణ తెలుగు ఒటీటీ ‘ఆహా’లో చేస్తున్న మోస్ట్ లవింగ్ టాక్ షో ‘అన్ స్టాపబుల్’. సీజన్ 2లో మరింత జోష్ చూపిస్తున్న బాలయ్య, ప్రభాస్ తో కలిసి సందడి చేశాడు. లాస్ట్ వీక్ ఈ బాహుబలి ఎపిసోడ్ నుంచి పార్ట్ 1 బయటకి వచ్చి సెన్సేషనల్ వ్యూస్ రాబట్టింది. తాజాగా బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2ని రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్, గోపీచంద్, బాలయ్య కలిసి చేసిన ఫన్ వ్యూవర్స్ ని ఆకట్టుకుంటుంది. ఈ ముగ్గురూ కలిసి పార్ట్ 1లో కాస్త తగ్గిన ఫన్ డోస్ ని పార్ట్ 2ని ఫుల్ ఫిల్ చేశారు. ముఖ్యంగా ప్రభాస్, గోపీచంద్ మధ్య జరిగిన క్యూట్ మొమెంట్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి. ఇద్దరు హీరోల మధ్య ఇగో లేకుండా ఇంత ఫ్రెండ్లీగా ఉంటారా అనిపించేలా ప్రభాస్ అండ్ గోపీచంద్ లు ఉన్నారు. జిల్ సినిమా తన దగ్గరికి ఎలా వచ్చిందో గోపీచంద్ చెప్పడం, ప్రభాస్ ని బాలయ్యతో కలిసి గోపీచంద్ కూడా ఆటపట్టించడం ఎపిసోడ్ కే హైలైట్ అని చెప్పాలి. ఇక రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి మాట్లాడుతూ ప్రభాస్ ఎమోషనల్ అయ్యాడు, ఆ సమయంలో అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా సైలెంట్ అయిపోయారు.

ఫాన్స్ ని ఉద్దేశించి లవ్ యు చెప్పిన ప్రభాస్, స్క్రీన్ పైన వేసిన ఒక ఎడిటింగ్ ఫోటో చూసి కంగారు పడ్డాడు. ప్రభాస్ ఒక అమ్మాయిని పెళ్లి గెటప్ లో హగ్ చేసుకున్నట్లు ఉన్న ఆ ఫోటోలోని అమ్మాయి ఎవరో చెప్పండి సర్ లేదంటే మా అమ్మ కంగారు పడిపోతుంది అంటూ అందరినీ నవ్వించాడు. అనుష్క, కృతి సనన్ ఫోటోలని చూసిన సమయంలో ప్రభాస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఎంత క్యూట్ ఉన్నాడు రా బాబు అనిపించక మానదు. మొత్తానికి ఫన్, ఎమోషనల్, ఫ్రెండ్లీ ఇలా అన్ని ఎమోషన్స్ ని కలగలిపిన ఒక ఇంటర్వ్యూలో ‘ఆహా’ మరియు బాలయ్యలు కలిసి ప్రభాస్ పాన్ ఇండియా ఫాన్స్ కి గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ ఎపిసోడ్ పార్ట్ 1 కన్నా పెద్ద హిట్ అయ్యి, ఒక టాక్ లో ముందెన్నడూ క్రియేట్ చెయ్యని వ్యూవర్షిప్ రికార్డుని సెట్ చేస్తుందేమో చూడాలి.

Exit mobile version