NTV Telugu Site icon

Prabhas: బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో బాహుబలి కాంబినేషన్ రిపీట్ అవుతోంది

Prabhas

Prabhas

మోడరన్ వరల్డ్ లో ఇండియన్ సినిమా ఇమేజ్ ని పూర్తిగా మార్చేసిన సినిమా ‘బాహుబలి’. ఈరోజు వరస బెట్టి పాన్ ఇండియా సినిమాలు ఎన్ని వచ్చినా, అన్నింటికీ ఆద్యం పోసింది మాత్రం బాహుబలి 1& 2 మాత్రమే. కలెక్షన్స్ విషయంలో కూడా ఎన్ని సినిమాలు ఎన్ని వందల కోట్లు రాబట్టిన బాహుబలినే టాప్ లో ఉంది. రాజమౌళి తప్ప బాహుబలిని తలదన్నే సినిమా ఇంకొకరు చేయలేరు. ఏ ముహూర్తాన ప్రభాస్, రాజమౌళి ‘బాహుబలి’ చేద్దామని అనుకున్నారో.. ఆ రోజే పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలకు పునాది పడింది. లేదంటే ఇవాళ పాన్ సినిమా అనే పదమే ఉండేది కాదు. ఈ సినిమాతో ప్రభాస్, రాజమౌళి పాన్ ఇండియా స్టార్‌డమ్స్ అందుకున్నారు. ఒకే ఒక్క సినిమా ఇద్దరినీ ఇండియన్ సినిమా వద్ద టాప్ చైర్‌లో కూర్చోబెట్టింది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న టాప్ హీరో, టాప్ డైరెక్టర్… ప్రభాస్, రాజమౌళినే అనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఈ ఇద్దరిపై ఇండస్ట్రీలో కొన్ని వేల కోట్ల మార్కెట్ జరుగుతోంది. ముఖ్యంగా ప్రభాస్ చేతిలో ఏకంగా మూడు వేల కోట్ల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే ఈ బాహుబలి కాంబోకి సపోర్ట్‌గా మెయిన్ పిల్లర్‌గా నిలిచింది మాత్రం నిర్మాతలే. బాహుబలి సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ అవ్కుంవడా ఆర్కా మీడియా వర్క్స్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు.

ప్రభాస్, రాజమౌళికి ఎంత పేరొచ్చిందో.. బాహుబలి సినిమాతో వీళ్లకు అంతే క్రెడిట్ దక్కింది. అయితే ఈ ప్రొడ్యూసర్స్ తో ఏడేళ్లు గడుస్తున్నా మరో సినిమా చేయలేదు ప్రభాస్. తన హోమ్ బ్యానర్ యువి క్రియేషన్స్, టీ సిరీస్ సంస్థలతోనే ప్రభాస్ ఎక్కువగా సినిమాలు చేస్తున్నాడు. అయితే.. ఇటివలే ప్రభాస్, బాహుబలి ప్రొడ్యూసర్స్ ని కలిశాడు. ఈ మీటింగ్ బాహుబలి 3 గురించా లేక వేరే ప్రాజెక్ట్ గురించా అనేది ఇంకా తెలియలేదు కానీ ఈ ప్రొడక్షన్ హౌజ్ నుంచి ప్రభాస్ సినిమా బయటకి రావడం గ్యారెంటీగా కనిపిస్తోంది. బాహుబలి రేంజులో ప్రభాస్ కెరీర్లోనే మరో అద్భుతమైన సినిమా చెయ్యడానికి మేకర్స్ రెడీ అయ్యారు. అయితే ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్సెస్ తక్కువ. ప్రభాస్ కమిట్మెంట్స్ అయిపోయాక ఈ ప్రాజెక్ట్ ఉండనుంది. ప్రస్తుతానికి ఈ క్రేజీ కాంబో ఫిక్స్ అయిందనే న్యూస్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఎగ్జైట్మెంట్‌గా మారింది. మరి ఈ సారి బాహుబలి కాంబో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుంది, ఈ కాంబినేషన్ లో వచ్చే ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేసే దర్శకుడు ఎవరు అనేది చూడాలి.