Prabhas: బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో బాహుబలి కాంబినేషన్ రిపీట్ అవుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడరన్ వరల్డ్ లో ఇండియన్ సినిమా ఇమేజ్ ని పూర్తిగా మార్చేసిన సినిమా ‘బాహుబలి’. ఈరోజు వరస బెట్టి పాన్ ఇండియా సినిమాలు ఎన్ని వచ్చినా, అన్నింటికీ ఆద్యం పోసింది మాత్రం బాహుబలి 1& 2 మాత్రమే. కలెక్షన్స్ విషయంలో కూడా ఎన్ని సినిమాలు ఎన్ని వందల కోట్లు రాబట్టిన బాహుబలినే టాప్ లో ఉంది. రాజమౌళి తప్ప బాహుబలిని తలదన్నే సినిమా ఇంకొకరు చేయలేరు. ఏ ముహూర్తాన ప్రభాస్, రాజమౌళి ‘బాహుబలి’ చేద్దామని అనుకున్నారో.. ఆ రోజే పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలకు పునాది పడింది. లేదంటే ఇవాళ పాన్ సినిమా అనే పదమే ఉండేది కాదు. ఈ సినిమాతో ప్రభాస్, రాజమౌళి పాన్ ఇండియా స్టార్‌డమ్స్ అందుకున్నారు. ఒకే ఒక్క సినిమా ఇద్దరినీ ఇండియన్ సినిమా వద్ద టాప్ చైర్‌లో కూర్చోబెట్టింది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న టాప్ హీరో, టాప్ డైరెక్టర్… ప్రభాస్, రాజమౌళినే అనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఈ ఇద్దరిపై ఇండస్ట్రీలో కొన్ని వేల కోట్ల మార్కెట్ జరుగుతోంది. ముఖ్యంగా ప్రభాస్ చేతిలో ఏకంగా మూడు వేల కోట్ల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే ఈ బాహుబలి కాంబోకి సపోర్ట్‌గా మెయిన్ పిల్లర్‌గా నిలిచింది మాత్రం నిర్మాతలే. బాహుబలి సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ అవ్కుంవడా ఆర్కా మీడియా వర్క్స్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు.
ప్రభాస్, రాజమౌళికి ఎంత పేరొచ్చిందో.. బాహుబలి సినిమాతో వీళ్లకు అంతే క్రెడిట్ దక్కింది. అయితే ఈ ప్రొడ్యూసర్స్ తో ఏడేళ్లు గడుస్తున్నా మరో సినిమా చేయలేదు ప్రభాస్. తన హోమ్ బ్యానర్ యువి క్రియేషన్స్, టీ సిరీస్ సంస్థలతోనే ప్రభాస్ ఎక్కువగా సినిమాలు చేస్తున్నాడు. అయితే.. ఇటివలే ప్రభాస్, బాహుబలి ప్రొడ్యూసర్స్ ని కలిశాడు. ఈ మీటింగ్ బాహుబలి 3 గురించా లేక వేరే ప్రాజెక్ట్ గురించా అనేది ఇంకా తెలియలేదు కానీ ఈ ప్రొడక్షన్ హౌజ్ నుంచి ప్రభాస్ సినిమా బయటకి రావడం గ్యారెంటీగా కనిపిస్తోంది. బాహుబలి రేంజులో ప్రభాస్ కెరీర్లోనే మరో అద్భుతమైన సినిమా చెయ్యడానికి మేకర్స్ రెడీ అయ్యారు. అయితే ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్సెస్ తక్కువ. ప్రభాస్ కమిట్మెంట్స్ అయిపోయాక ఈ ప్రాజెక్ట్ ఉండనుంది. ప్రస్తుతానికి ఈ క్రేజీ కాంబో ఫిక్స్ అయిందనే న్యూస్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఎగ్జైట్మెంట్‌గా మారింది. మరి ఈ సారి బాహుబలి కాంబో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుంది, ఈ కాంబినేషన్ లో వచ్చే ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేసే దర్శకుడు ఎవరు అనేది చూడాలి.
Also Read
- Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్‌తో అభిమానుల భారీ వేడుకలు!
- Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్‌తో ఇండియా మార్కెట్‌పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
- Makutam Release Date: దర్శకుడిగా విశాల్‌కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్‌కు కౌంట్‌డౌన్!
- Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్‌తో వస్తోన్న అల్లు అర్జున్
తాజావార్తలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్‌తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్‌తో ఇండియా మార్కెట్‌పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్‌పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!