NTV Telugu Site icon

Adipurush: ‘ఆదిపురుష్’ ట్రైలర్ వచ్చేస్తోంది!

Adipurush

Adipurush

టీజర్ తో ఆదిపురుష్ సినిమాపై నెగటివిటి విపరీతంగా వచ్చింది, విడుదలని కూడా వాయిదా వేసుకునే రేంజులో ఆదిపురుష్ సినిమాపై ట్రోల్లింగ్ కూడా జరిగింది. ఈ ట్రోల్లింగ్ ని దాటుకోని, పాజిటివ్ బజ్ ని క్రియేట్ చెయ్యడానికి ఆదిపురుష్ సినిమాకి దాదాపు ఆరే నెలలు పట్టింది. అక్టోబర్ లో టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఇటివలే అక్షయత్రితియ రోజున కొత్త మోషన్ పోస్టర్ రిలీజ్ చేసే వరకూ ఆదిపురుష్ సినిమా ఎన్నో కష్టాలని ఫేస్ చేసింది. రాముడు పడినన్ని కష్టాలు పడిన ఆదిపురుష్ సినిమా ఎట్టకేలకు పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేసింది. ‘జై శ్రీరామ్’ సాంగ్, ఆ ఎపిక్ చాంటింగ్ ఆదిపురుష్ సినిమాని ప్రపంచవ్యాప్త ఆడియన్స్ ముందు మోస్ట్ వాంటెడ్ సినిమాగా నిలబెట్టింది. ఇదే మూమెంట్‌లో మరింత పాజిటివ్ హైప్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు.

Read Also: NTR : ఎన్టీఆర్‎తో వర్క్ చేయాలని ఉందంటున్న హాలీవుడ్ డైరెక్టర్

ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తున్న మేకర్స్ శ్రీరామనవమికి ఓ పోస్టర్, హనుమాన్ జయంతికి మరో పోస్టర్ రిలీజ్ చేశారు. రీసెంట్‌గా ట్రిబెకా ఫెస్టివల్ కోసం పెట్టిన అప్డేటేట్ టీజర్ క్లిప్ వైరల్ అయింది. ఇక జై శ్రీరామ్ అంటూ సాగే లిరికల్ మోషన్ పోస్టర్‌ అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. గత వారం, పది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఆదిపురుష్ హవా నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఆదిపురుష్ నుంచి సాలిడ్ అప్డేట్ వస్తే.. మామూలుగా ఉండదు. అందుకే ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు ఓం రౌత్. ఏప్రిల్ 29న లేదా మే 17న ఆదిపురుష్ సినిమా నుంచి బిగ్గెస్ట్ అప్డేట్ బయటకి రాబోతుంది అనే టాక్ వినిపిస్తోంది. ఇది దాదాపు ట్రైలర్ రిలీజ్ కి సంబంధించిన అప్డేట్ అని సమాచారం. రెండు డేట్స్ లో ఒక రోజు ఆదిపురుష్ ట్రైలర్‌ను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే ట్రైలర్ కట్ స్టార్ట్ చేశారట మేకర్స్. ఏదేమైనా ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ అయిన రోజు మాత్రం.. సోషల్ మీడియా అంత ప్రభాస్ ఫాన్స్ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది అనేది మాత్రం గ్యారెంటీగా చెప్పొచ్చు.