NTV Telugu Site icon

Adipurush: అహంకారపు రొమ్ము చీల్చడానికి దూకండి ముందుకి…

Adipurush

Adipurush

ఈ జనరేషన్ ఫస్ట్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫేస్ చేసినంత ట్రోల్లింగ్ ఈ మధ్య కాలంలో మరో సినిమా ఫేస్ చేసి ఉండదు. నెగటివ్ కామెంట్స్ చేసిన వారి నుంచే కాంప్లిమెంట్స్ అందుకునే రేంజుకి వెళ్లింది ఆదిపురుష్ సినిమా. ఆరు నెలల సమయం తీసుకోని విజువల్ ఎఫెక్ట్స్ ని కరెక్ట్ చేశాడు ఓం రౌత్, దాని రిజల్ట్ ఈరోజు ఆదిపురుష్ సినిమా గురించి వినిపిస్తున్న పాజిటివ్ బజ్ కి కారణం అయ్యింది. బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్ తో హైప్ పెంచిన మేకర్స్, ఈసారి AMB సినిమాస్ లో ఆదిపురుష్ ట్రైలర్ ని ప్రీమియర్ చేసి సినిమాపై అంచనాలని అమాంతం పెంచేశారు. లేటెస్ట్ గా ఆదిపురుష్ ట్రైలర్ ని యుట్యూబ్ లో కూడా రిలీజ్ చేశారు. డిజిటల్ రిలీజ్ అయిపోవడంతో ఫాన్స్ అంతా ఆదిపురుష్ ట్రైలర్ ని రిపీట్ మోడ్ లో చూస్తున్నారు.

Read Also: Mahesh Babu: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సూపర్ స్టార్…

హనుమంతుని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆదిపురుష్ సినిమా జరుగుతుంది అనే క్లారిటీని మేకర్స్, ట్రైలర్ తోనే ఇచ్చేశారు. గ్రాండియర్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంలా ఆదిపురుష్ ట్రైలర్ ఉంది. రాముడిగా ప్రభాస్ మెస్మరైజ్ చేసేలా ఉన్నాడు. ట్రైలర్ మధ్యలో “అహంకారపు రొమ్ము చీల్చడానికి దూకండి ముందుకి…” అని ప్రభాస్ చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ తెచ్చే రేంజులో ఉంది. వార్ ఎపిసోడ్స్ ని ట్రైలర్ లో సాలిడ్ గా చూపించారు. ట్రైలర్ ఎండ్ లో సైఫ్ అలీ ఖాన్ లుక్ ని రివీల్ చేశారు, రావణ బ్రహ్మగా సైఫ్ అలీ ఖాన్ యాప్ట్ అయ్యాడు. ఆదిపురుష్ ట్రైలర్ ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచింది. జై శ్రీరామ్ చాంటింగ్ వస్తుంటే, ఆ BGMకి రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఈ హైప్ తో జూన్ 16న ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయితే ఇండియన్ బాక్సాఫీస్ మరోసారి షేక్ అవ్వడం గ్యారెంటీ. ఆరోజున థియేటర్స్ అన్నీ రామమందిరాలుగా మారడం పక్కాగా జరిగేలా ఉంది.

Show comments