Prabhas Adipurush ticket prices hiked in Andhrapradesh : ఆది పురుష్ మూవీ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ రఘురాముడి పాత్రలో నటించగా కృతి సనన్ సీత పాత్రలో నటించిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడి పాత్రలో నటించారు. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు గుడ్‌న్యూస్ చెప్పాయి, అదేమంటే ఈ సినిమా టికెట్ రేట్లు పెంచి అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చాయి. భారీ బడ్జెట్ సినిమాలు విడుదలవుతున్నప్పుడు ఆయా సినిమాల నిర్మాతల అభ్యర్ధనల మేరకు మొదటి వారం టికెట్ ధరలను పెంచుకునేలా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తున్న విషయం తెలిసిందే.
Also Read: Adipurush: తెలివిగా సైడైన ప్రభాస్.. రికార్డులు చెరిపేస్తున్న ఆదిపురుష్!
ఇక ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ‘ఆదిపురుష్’ టికెట్ ధరల పెంపునకు ముందుగా అనుమతి ఇచ్చింది. ఒక జీవో విడుదల చేయగా ఆ జీవో ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ. 50 పెంచి అమ్ముకునే అవకాశం ఇచ్చింది. అయితే మొదటి మూడు రోజులు మాత్రమే ఈ పెంపునకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొంది. ఇక మూడు రోజుల పాటు రోజుకు ఆరు షోలకూ అనుమతి ఇచ్చింది టీ సర్కార్. ఆ లెక్కన తెల్లవారుజామున 4 గంటల నుంచి ఆదిపురుష్ చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించవచ్చని పేర్కొంది. ఇక తెలంగాణాలో సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో ప్రస్తుతం టికెట్ ధర రూ. 175 ఉండగా ఇప్పుడు దానికి అదనంగా రూ. 50 చెల్లించాలన్న మాట. అయితే 3డీ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో గ్లాస్‌లకు మాత్రం అదనపు ధర చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: Adipurush Tickets: పీపుల్స్ మీడియా నిర్మాతలకు మెంటలెక్కిస్తున్నారట!
ఇక మల్టీప్లెక్స్‌లో అయితే రూ. 295 తోపాటు 3డీ గ్లాస్‌ల ఛార్జీ వసూలు చేయనున్నారు నిర్వాహకులు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టికెట్ ధరపై రూ. 50 పెంచినట్లు ఒక జీవో జారీ చేసింది. ఇక ఏపీలో పదిరోజులు పెంచిన టికెట్ రేట్లు అమ్ముకోవచ్చని జారీ చేసిన జీవోలో పేర్కొన్నారు. ఇక ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న క్రమంలో అటు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. ఇక ఈ సినిమా ప్రదర్శిస్తున్న ప్రతి షోలో హనుమంతుడికి ఒక సీటు కేటాయించనున్నట్టు ప్రకటించిన అంశం సినిమాను మరింత చేరువ చేసింది. దేశ వ్యాప్తంగా సినీఅభిమానులు ఎంతగానో ఆదిపురుష్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.