Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరు వేయికళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాతో ప్రభాస్.. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వివాదాలను పక్కనపెడితే సినిమాపై బజ్ మాత్రం బాగానే క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా రిలీజ్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ముందు సంక్రాంతికి అన్నారు.. ఆ తరువాత వేసవికి.. ఇక ఇప్పుడు జూన్ అని ప్రకటించారు. జూన్ 16 న ఈ సినిమా అభిమానుల ముందుకు రానుంది. అయితే ఇది కూడా వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రభాస్ అభిమానులు గుండెజారిపోయింది. ఇకఅందులో నిజం లేదని బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ తరన్ ఆదర్శ్ చెప్పుకొచ్చాడు.
Chiranjeevi: పెంచు.. పెంచు.. హైప్ పెంచు.. చచ్చిపోవాలా జనాలు
ఆదిపురుష్ పోస్టుపోన్ అవ్వడం లేదు అంటూ ట్వీట్ చేశాడు. “ప్రభాస్- ఆదిపురుష్.. నో పోస్టుపోన్మెంట్.. ఈసారి ఖచ్చితంగా జూన్ 16 న సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ గా ట్రిబికా ఫెస్టివల్ లో జూన్ 13 న ప్రసారం కావడానికి సిద్దమయ్యింది. న్యూయార్క్ లో ఈ ఈవెంట్ జరుగుతుంది” అని చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులకు దైర్యం వచ్చేసింది. ఈసారి డార్లింగ్ ఖచ్చితంగా వస్తున్నాడు అని కన్ఫర్మ్ అయిపోయారు. అబ్బా సాయిరామ్ .. ఇది చాలు అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమా ప్రభాస్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
PRABHAS – ‘ADIPURUSH’: NO POSTPONEMENT… #Adipurush is very much on schedule this time: 16 June 2023 release… No postponement, since the #WorldPremiere date is already locked: 13 June 2023 at Tribeca Festival in #NewYork.
Meanwhile, #AdipurushTrailer arrives on 9 May 2023.… pic.twitter.com/mBTgh1cqbc
— taran adarsh (@taran_adarsh) May 3, 2023
