Site icon NTV Telugu

Prabhas: ట్రిబెకా ఫెస్టివల్ లో ఆదిపురుష్… ఇంటర్నేషనల్ లెవల్ కి ఇండియన్ సినిమా

Adipurush

Adipurush

ఇండియన్ సినిమా బౌండరీలని మొదటిసారి దాటించిన సినిమా ‘బాహుబలి’. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాతో ప్రభాస్ ఈ జనరేషన్ చూసిన మొదటి పాన్ ఇండియా హీరో అయ్యాడు. బాహుబలి 2 సినిమా లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శితం అయ్యింది. ఒక ఇండియన్ సినిమా ఆల్బర్ట్ హాల్ లో ప్రిమియర్ అవ్వడం అదే మొదటిసారి. ఇప్పుడు మరోసారి ఇండియన్ సినిమా బౌండరీలని దాటిస్తూ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’ మూవీ ‘ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్’ లో స్క్రీనింగ్ చెయ్యనున్నారు. ప్రభాస్ హీరోగా ‘టి సిరీస్ ఫిలిమ్స్’ 550 కోట్ల బడ్జట్ తో భారీ స్థాయిలో ప్రొడ్యూస్ చేస్తున్న మైథలాజికల్ జానర్ మూవీ ‘ఆదిపురుష్’. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్త నాగే హనుమంతుడిగా, సైఫ్ ఆలీ ఖాన్ రావణాసురుడిగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమాపై ప్రభాస్ ఫాన్స్ లో హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.

ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ జూన్ 16న ప్రపంచవ్యాప్త సినీ అభిమానుల ముందుకి రావడానికి రెడీ అయ్యింది. రిలీజ్ కన్నా ముందే స్పెషల్ స్క్రీనింగ్ కి రెడీ అయ్యింది ఆదిపురుష్ మూవీ. జూన్ 13న అమెరికాలోని న్యూయార్క్ లో జూన్ 7 నుండి 18 వరకూ జరిగే ట్రిబెకా ఫెస్టివల్ లో ఆదిపురుష్ సినిమా స్పెషల్ ప్రీమియర్ గా ప్రదర్శించనున్నారు. ఒక ఇండియన్ సినిమా ట్రిబెకా ఫెస్టివల్ లో స్క్రీనింగ్ అవ్వడం ఇదే మొదటిసారి. గతంలో బాహుబలి సినిమాతో ఇండియాన్స్ సినిమా ప్రైడ్ ని రాయల్ ఆల్బర్ట్ హాల్ వరకూ తీసుకోని వెళ్లడంలో భాగమైన ప్రభాస్, ఇప్పుడు ఆదిపురుష్ సినిమాలో కూడా భాగం అవ్వడం విశేషం. టీజర్ రిలీజ్ అయిన సమయంలో ఆదిపురుష్ సినిమాపై నెగటివ్ కామెంట్స్ వినిపించాయి. ఆ కామెంట్స్ ని కాంప్లిమెంట్స్ గా మార్చుకుంటూ ఆదిపురుష్ సినిమా రోజురోజుకీ పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేస్తోంది. మరి జూన్ 16న ఆడియన్స్ ని ఎంతగా మెప్పిస్తుందో చూడాలి.

Exit mobile version