NTV Telugu Site icon

Prabhas: ఆదిపురుష్ కి కొత్త కష్టం… ఓవర్సీస్ లో కష్టమే

Adi Purush

Adi Purush

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్ ఏ సమయంలో ఆది పురుష్ సినిమాని ఒప్పుకున్నాడో తెలియదు కానీ అప్పటినుంచి ఈ మూవీకి అన్ని కష్టాలే. వందల కోట్ల బడ్జట్ పెట్టినా సరిగ్గా రాని విజువల్ ఎఫెక్ట్స్, ప్రభస్ లుక్ పైన నెగటివ్ కామెంట్స్, సైఫ్ అలీ ఖాన్ లుక్ పైన ట్రోల్లింగ్ ఇలా ఒకటేంటి ఆది పురుష్ విషయంలో ఎన్నో జరిగాయి. ప్రభాస్ అభిమానులు కూడా డిజప్పాయింట్ అయ్యి సోషల్ మీడియాలో కామెంట్స్ చెయ్యడంతో మేకర్స్ ఆది పురుష్ రిలీజ్ డేట్ ని వాయిదా వేసి రిపేర్లు చేసే పనిలో పడ్డారు. రిపేర్లు అయిపోతున్నాయు జూలై 16న మా సినిమాని విడుదల చేస్తున్నాం అని మేకర్స్ ఇటివలే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈసారి అయినా ఆదిపురుష్ చెప్పిన డేట్, క్వాలిటీ కంటెంట్ తో రిలీజ్ అవుతుందా అని ప్రభాస్ ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్ సినిమాకి కొత్త కష్టం వచ్చి పడింది. పాన్ వరల్డ్ అంత పెద్దగా ఉన్న ఆ కష్టం పేరు ‘ది ఫ్లాష్’.

DC Comics నుంచి వస్తున్న ఈ మూవీపై హాలీవుడ్ సినీ అభిమానుల్లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ది ఫ్లాష్ మూవీ డిస్నీకి మంచి కలెక్షన్స్ తెస్తుంది అనే హాప్ లో సూపర్ హీరో ఫిల్మ్ లవర్స్ ఉన్నారు. త్వరలో ట్రైలర్ రిలీజ్ అవ్వనున్న ది ఫ్లాష్ మూవీని కూడా మేకర్స్ జూలై 16న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆది పురుష్ రిలీజ్ అయ్యే రోజునే ది ఫ్లాష్ కూడా రిలీజ్ అవుతుంది అంటే బాక్సాఫీస్ దగ్గర మంచి క్లాష్ చూసే ఛాన్స్ ఉంది. ఓవర్సీస్ లో ది ఫ్లాష్ సినిమా కారణంగా ప్రభాస్ మూవీకి కష్టాలు తప్పేలా లేవు. ఇండియాలో కూడా ఆది పురుష్ సినిమాకి A సెంటర్స్ లో ది ఫ్లాష్ మూవీ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రభాస్ సినిమా వస్తుంది అంటే ఇండియాలో ఇంకో పెద్ద సినిమా రిలీజ్ అయ్యే సాహసం చెయ్యదు కాబట్టి ఈసారి ప్రభాస్ వార్ హాలీవుడ్ సినిమాతో జరగనుంది. మరి ఈ బాక్సాఫీస్ వార్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.