పాయల్ రాజ్ పుత్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆర్ఎక్స్ 100 సినిమాతో బాగా పాపులర్ అయింది పాయల్. మొదటి సినిమా తోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెలుగు లో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది. కానీ ఆర్ఎక్స్ 100 సినిమాతో వచ్చినంత పాపులరిటి తనకు ఏ సినిమా తో రాలేదు..అయినా కూడా వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ భామ.తెలుగు తో పాటు ఇతర భాషలలో కూడా సినిమాలు చేస్తుంది ఈ భామ.. ఈ భామ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.వరుస ఫోటో షూట్ లతో తెగ రచ్చ చేస్తుంది.ఇక ఈ బ్యూటీ ఒక వ్యక్తితో ప్రేమలో కూడా ఉంది.అతని తో ప్రస్తుతం సహజీవనం చేస్తున్నట్లు సమాచారం.. అతని తో కలిసి దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ఉంటుంది.తన రొమాంటిక్ ఫోటోల తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది పాయల్.
ప్రస్తుతం తాను మంగళవారం అనే సినిమాలో నటిస్తుంది.రీసెంట్ గా ఈ సినిమా టీజర్ కూడా విడుదల అయింది. టీజర్ ప్రేక్షకులందరిని ఎంత గానో ఆకట్టుకుంది. మంగళవారం సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం అని చాలామంది కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇక టీజర్ విడుదలైన సందర్భంగా తను తన ఫాలోవర్స్ తో కాసేపు చాట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.సినిమా గురించి తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపిక గా సమాధానం ఇచ్చింది.అంతేకాకుండా తన పర్సనల్ విషయాల ను కూడా వెల్లడించింది.అలా ఓ నెటిజన్ ప్రభాస్ గురించి అడగటంతో తనకు ప్రభాస్ తో మంగళవారం సినిమా చూడాలని ఉందని తన మనసులోని మాటను తెలిపింది. ఇక ప్రస్తుతం ఆమె పంచుకున్న స్టోరీ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.తాను నటించిన మంగళవారం సినిమా విజయం సాధిస్తే ఆమెకు మళ్ళీ వరుస గా ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది.