Site icon NTV Telugu

Posani krishna Murali: 5 లక్షలు ఇచ్చి ప్రాధేయపడ్డ అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా?

Posani

Posani

Posani krishna Murali Says Allu arjun secretly gave him 5 lakhs: ఒకానొక సందర్భంలో తనను అల్లు అర్జున్ ఇంటికి పిలిపించి మరీ ఐదు లక్షల రూపాయలు ఇచ్చారని పోసాని కృష్ణ మురళి తాజా ప్రెస్ మీట్ లో వెల్లడించారు. తమ మధ్య వయసు వ్యత్యాసం ఉన్నా తామిద్దరం మంచి స్నేహితులగా ఉంటామని పేర్కొన్న పోసాని ఒకసారి అల్లు అర్జున్ తనను ఇంటికి టీ తాగినందుకు రమ్మని ఆహ్వానించాడు అని చెప్పుకొచ్చారు. ఇంటికి వెళ్లిన తర్వాత ముందు టీ తాగమని చెప్పి తర్వాత ఒక ఐదు లక్షల రూపాయల చెక్ ఇచ్చారని నాకెందుకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు అని అడిగితే ఉంచండి మీ దగ్గర అని అంటే నేను వెల్ సెటిల్డ్ కదా బాగానే ఉన్నాను నాకెందుకు మీరు ఇస్తున్నారు అని అడిగానని చెప్పుకొచ్చాడు. మీరు డబ్బులు ప్రాపర్ గా యూస్ చేస్తారు, వృధా చేయరు, సద్వినియోగం చేస్తారు అది నాకు నచ్చింది. నేను చాలా సార్లు మీరు సహాయం చేయడం చూశాను, చాలా మందికి గుండె ఆపరేషన్లు చేయించారు, ఎన్నో సహాయాలు చేశారు.

Samantha: సమంత పెద్ద మనసు.. కోటి ఇచ్చేసిందట..?

మీరు అలా చేసినట్టు కూడా చాలా మందికి తెలియదు. ఈ ఐదు లక్షల కూడా మీరు మంచి పనికి వాడతారు అనే నమ్మకం నాకుంది వీటిని వృధా చేయరు అని చెబుతూ దయచేసి తీసుకోను అని అనవద్దని ప్రాధేయపడ్డాడని చెప్పుకొచ్చారు. తాను ఆ డబ్బు తీసుకుని ముగ్గురు ప్రతిభావంతులైన ఆడపిల్లల చదువుల కోసం వినియోగించానని ఒక న్యూస్ ఛానల్ లైవ్ లోనే వారందరికీ ఆ డబ్బులు పంపిణీ చేసి అల్లు అర్జున్ కి థాంక్స్ చెప్పించానని చెప్పుకొచ్చారు. అలా ఎందుకు చెప్పించావని తర్వాత అల్లు అర్జున్ అడిగినా సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్నట్టు మీరు సహాయం చేస్తే నా పేరు చెప్పుకోవడం ఇష్టం లేకే చెప్పుకొచ్చానని అన్నారు. మొత్తం మీద పోసాని కృష్ణ మురళి చెప్పిన ఈ ఐదు లక్షల వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.

Exit mobile version