కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 18న విడుదల కానుంది. నిజజీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. “సన్ ఆఫ్ ఇండియా” చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ రచయిత, సీనియర్ నటుడు పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also : Khiladi Controversy : రవితేజ చీప్ స్టార్… డైరెక్టర్ వైఫ్ సంచలన కామెంట్స్
ఆయన ఇండస్ట్రీలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారన్న విషయాన్ని వెల్లడిస్తూ… ఐదేళ్ల ప్రయాణం తరువాత సినీ ఇండస్ట్రీని చూసి తాను పరుచూరి బ్రదర్స్ లా మాత్రం బతకొద్దు అనుకున్నాను అని, వాళ్లకు అసలు ఎలా బ్రతకాలో తెలియదు. వాళ్ళు సరిగ్గా కథలు రాసి 20 ఏళ్ళు అవుతోంది అంటూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోసాని ఇంకా ఏం మాట్లాడారో ఈ వీడియోలో వీక్షించండి.