NTV Telugu Site icon

Posani Case : రైల్వే కోడూరు కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్

Posani (3)

Posani (3)

పోసాని కృష్ణ మురళిని కస్టడీకి కోరుతూ గత రెండు రోజుల క్రితం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ సోమవారం కడప ఫోర్త్ ఏడిజే కోర్ట్ ముందు విచారణకు రానున్నది. రైల్వే కోడూరు కోర్ట్ జడ్జ్ తేజ సాయి ట్రైనింగ్ కోసం నెల రోజులు సెలవు పై వెళ్లడంతో పోసాని కస్టడీ పిటిషన్ ను కడప కోర్టులో విచారించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు సినీ పరిశ్రమమీద పోసాని చేసిన వ్యాఖ్యలపై ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.

Also Read : OTT : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విడాముయార్చి.. ఎక్కడ చూడాలంటే .?

ఈ కేసులో పోలీసులు పోసానిని అరెస్టు చేసి కోర్టుమందు హాజరు పెట్టగా, రైల్వే కోడూరు జడ్జి 14 రోజుల రిమాండ్ కు ఆదేశించారు. రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని విచారించాల్సిన అవసరం ఉందని, ఐదు రోజులపాటు విచారణ చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ ఓబులవారిపల్లె పోలీసులు రైల్వే కోడూరు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. రైల్వే కోడూరు జడ్జ్ సెలవులో ఉన్నందున ఈ కేసును కడప కోర్టులో విచారించనున్నారు. పోసానికి బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాదులు రైల్వే కోడూరు కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ కూడా సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే కస్టడీ పిటిషన్ ముందు విచారించి, అనంతరం బెయిల్ పిటిషన్ పై విచారించుకున్నారు. కస్టడీ పిటిషన్ డిస్మిస్ అయితే బెయిల్ పిటీషన్ పై విచారణ జరనున్నది.