ప్రస్తుతం చిత్రపరిశ్రమలో చాలామంది నటీనటులు క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. అయితే కొందరు ఆ క్యాన్సర్ మహమ్మారిని జయించి జీవిస్తుంటే.. ఇంకొందరు ఆ మహమ్మారి వలన మృత్యువాత పడుతున్నారు. తాజాగా మరో స్టార్ నటి క్యాన్సర్ బారిన పాడడం బాధాకరమైన విషయం. హిందీ సీరియల్స్ తో పాపులర్ అయిన నటి ఛావి మిట్టల్ రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇటీవల జిమ్ లో వర్క్స్ అవుట్స్ చేస్తుండగా ఆమె గాయపడింది. వెన్తనె వైద్యులను సంప్రదించగా రొమ్ములో కణితి ఉందని గుర్తించి టెస్ట్ లు చేయగా రొమ్ము క్యాన్సర్ అని నిర్దారణ అయ్యింది. దీంతో ఆమె త్వరలోనే సర్జరీ చేయించుకోనుంది. ఇక ఈ విషయం తెలిసినప్పటినుంచి ఛావి భయపడకుండా తనలా బాధపడుతున్న మరెంతో మందికి రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తోంది.
” ప్రతి ఒక్కరు ఎప్పుడు బలవంతులుగా ఉండలేరు. ప్రతి ఒక్కరికీ బాధకరమైన క్షణాలుంటాయి. ఆ సమయంలో బాధపడటంలో తప్పేమీ లేదు. ఎంతో ఆనందంగా గడుపుతున్న జీవితంలో ఇలాంటి బాధాకరమైన క్షణాలు ఎందుకు వచ్చాయి అని బాధపడంలో తప్పులేదు. చికిత్స తీసుకునేటప్పుడు శరీరం అనేక ఇబ్బందులను ఎదుర్కోంటుంది. తప్పనిసరిగా ఇది శారీరక పోరాటం. అయితే అందుకు నేను బాధపడాలనుకోవడం లేదు.. నా ప్రయాణాన్ని ఎమోషనల్ గా మార్చుకోవాలనుకోవడం లేదు. అందుకే ప్రతిరోజూ నవ్వుతూ జీవిచండానికి ప్రయత్నిస్తున్నా” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇకపోతే ఛావి.. మొహీత్ హుస్సేన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు. పిల్లలు కోసమైన ఆమె ఆరోగ్యంగా తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
