Site icon NTV Telugu

Pawan Kalyan: బిగ్ బ్రేకింగ్.. జనసేనలోకి స్టార్ నిర్మాత

Pawan

Pawan

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా తిరుగుతున్న విషయం తెల్సిందే. 2024 ఎన్నికలు దగ్గరపడుతుండడటంతో పవన్.. ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టాడు. మరో రెండు రోజుల్లో ఆయన వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే జనసేన తరుపున ప్రచారానికి సర్వం సిద్ధం చేస్తున్నారు జనసైనికులు. ఇక మరోపక్క కొత్తవారు జనసేన పార్టీ కండువా కప్పుకొని పవన్ కు తమ మద్దత్తును తెలుపుతున్నారు. తాజాగా జనసేనలోకి అడుగుపెట్టాడు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ BVSN ప్రసాద్. భోగవల్లి వెంకట సత్యనారాయణ ప్రసాద్.. 2003లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పేరుతో సినిమా నిర్మాణ సంస్థను స్థాపించిన ఆయన ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించాడు. ఇక పవన్ తో అత్తారింటికి దారేది, రామ్ చరణ్ తో మగధీర లాంటి హిట్ సినిమాలను నిర్మించాడు.

Gongura Rice : గోంగూర రైస్ ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు..

ప్రస్తుతం వరుణ్ తేజ్ తో గాండీవధారి అర్జున అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయ ఆసక్తితో జనసేనలో చేరడం జరిగింది. కొద్దిసేపటి క్రితం జనసేన కార్యాలయంలో పవన్.. BVSN ప్రసాద్ కు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వారాహి యాత్రలో పవన్ పక్కనే ఈయన ఉండనున్నట్లు సమాచారం. ఎప్పటినుంచో రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని ప్రసాద్ ప్రయత్నాలు చేస్తున్నారని, పవన్ నిజాయితీ, మంచితనం చూసి వారి పార్టీలో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. మరి ప్రచార కార్యక్రమాలలో ప్రసాద్ ఎలాంటి వాక్చాతుర్యం చూపిస్తారో చూడాలి.

Exit mobile version