Poonam Pandey: ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే మారోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చారు. భారతదేశంలో ‘‘వ్యభిచారాన్ని’’ చట్టబద్ధం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. అడల్డ్ కంటెంట్, శృంగార వీడియోలు, ఆమె నటించే బోల్డ్ వీడియోలు ఒక రకమైన ‘‘సామాజిక సేవ’’గా అభివర్ణించారు. చాలా మంది పురుషులు చెప్పుకోలేని ఒత్తిడిలో ఉంటారని, నిరాశను అనుభవిస్తారని, తన వీడియోల్లో ఒకటి ఎవరి ఒత్తిడినైనా తగ్గించడంలో సహాయపడితే అందులో తప్పేముంది అని ప్రశ్నించారు.
భారత్‌లో వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయడం వల్ల మహిళలపై జరిగే నేరాలను తగ్గించే అవకాశం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. తన అడల్ట్ కంటెంట్‌ను భారత్‌కే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక సామాజిక సేవగా భావిస్తున్నట్లు పూనమ్ చెప్పుకొచ్చారు. అయితే, తన బోల్డ్ కంటెంట్ కారణంగా తీవ్రస్థాయిలో ట్రోలింగ్, విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని వెల్లడించారు. ఇండస్ట్రీకి చెందిన కొందరు సెలబ్రిటీలు, స్నేహితులు కూడా తన వీడియోలను రహస్యంగా చూస్తూ బయటకు మాత్రం తనను ఎగతాళి చేస్తుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రోలింగ్‌పై స్పందిస్తూ.. కొన్ని కామెంట్లు చదివినప్పుడు తనకు కోపం వస్తుందని, కొన్ని సార్లు ఘాటుగా స్పందించాలని అనిపిస్తుందని, తన స్థాయిని తగ్గించుకోకుండా సంయమనం పాటిస్తానని తెలిపారు.

