Site icon NTV Telugu

Poonam Pandey: పూనమ్ చనిపోలేదు.. బాడీ గార్డ్ సంచలన వ్యాఖ్యలు

Poonam

Poonam

Poonam Pandey: నటి, మోడల్ పూనమ్ పాండే మృతి నేటి ఉదయం మృతి చెందిన విషయం తెల్సిందే. గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె.. సడెన్ గా మృతి చెందింది. ఈ విషయాన్నీ ఆమె మేనేజర్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. శృంగారతారగా పూనమ్ ఎంత గుర్తింపు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతి చిన్న వయస్సులోనే ఆమె చనిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక పూనమ్ మృతి వార్త విన్న ఆమె బాడీ గార్డ్ ఆమె లేదు అన్న విషయాన్నీ నమ్మలేకపొతున్నాడు. పూనమ్ కుటుంబ సభ్యులు అధికారికంగా ఆమె చనిపోయినట్లు ఎందుకు చెప్పడం లేదని అతను ప్రశ్నిస్తున్నాడు.

పూనమ్‌ దగ్గర 11 ఏళ్లుగా బాడీగార్డుగా పని చేస్తున్న ఆమిన్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. ” పూనమ్ చనిపోలేదు.. ఆమె చనిపోయింది అంటే నేను నమ్మను.. ఆమెతో నేను ఎన్నో ఏళ్ళు కలిసి పనిచేసాను. పూనమ్ ఎలా ఉంటుంది అనేది నాకు బాగా తెలుసు.. జనవరి 31 న మేము కలిశాం. ఒక మాల్ లో ఫోటోషూట్ కోసం వెళ్ళినప్పుడు నేను అక్కడే ఉన్నాను. పూనమ్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. ఫిట్ గా ఉంటుంది. నవ్వుతూ ఉంటుంది. ఆమెకు అసలు అనారోగ్యం ఉందన్న విషయం కూడా నేనెప్పుడూ వినలేదు. ఉదయం నేను కూడా సోషల్ మీడియాలో చూసి తెలుసుకున్నాను. వెంటనే పూనమ్ సోదరి ఇంటికి వెళ్లి.. నిజమెంటో తెలుసుకుందామని ప్రయత్నించాను. కానీ, ఆమె నా ఫోన్స్ ఆన్సర్ చేయడం లేదు. అసలు నిజమేంటో తెలియాల్సి ఉంది. తన సోదరి రిప్లై కోసం ఎదురుచూస్తున్నాను. కొన్నిరోజుల క్రితం పూనమ్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అంతా నార్మల్ గానే కనిపించింది. ఆమె ఆల్కహాల్ తీసుకోవడం కూడా మానేసింది. అసలు నిజాలు తెలియాలంటే.. పూనమ్ సోదరి చెప్పాల్సిందే” అని చెప్పుకొచ్చాడు. మరి పూనమ్ సోదరి మీడియా ముందుకు వస్తుందేమో చూడాలి.

Exit mobile version