Poonam Pandey: పూనమ్ చనిపోలేదు.. బాడీ గార్డ్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poonam Pandey: నటి, మోడల్ పూనమ్ పాండే మృతి నేటి ఉదయం మృతి చెందిన విషయం తెల్సిందే. గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె.. సడెన్ గా మృతి చెందింది. ఈ విషయాన్నీ ఆమె మేనేజర్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. శృంగారతారగా పూనమ్ ఎంత గుర్తింపు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతి చిన్న వయస్సులోనే ఆమె చనిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక పూనమ్ మృతి వార్త విన్న ఆమె బాడీ గార్డ్ ఆమె లేదు అన్న విషయాన్నీ నమ్మలేకపొతున్నాడు. పూనమ్ కుటుంబ సభ్యులు అధికారికంగా ఆమె చనిపోయినట్లు ఎందుకు చెప్పడం లేదని అతను ప్రశ్నిస్తున్నాడు.
పూనమ్ దగ్గర 11 ఏళ్లుగా బాడీగార్డుగా పని చేస్తున్న ఆమిన్ ఖాన్ మాట్లాడుతూ.. ” పూనమ్ చనిపోలేదు.. ఆమె చనిపోయింది అంటే నేను నమ్మను.. ఆమెతో నేను ఎన్నో ఏళ్ళు కలిసి పనిచేసాను. పూనమ్ ఎలా ఉంటుంది అనేది నాకు బాగా తెలుసు.. జనవరి 31 న మేము కలిశాం. ఒక మాల్ లో ఫోటోషూట్ కోసం వెళ్ళినప్పుడు నేను అక్కడే ఉన్నాను. పూనమ్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. ఫిట్ గా ఉంటుంది. నవ్వుతూ ఉంటుంది. ఆమెకు అసలు అనారోగ్యం ఉందన్న విషయం కూడా నేనెప్పుడూ వినలేదు. ఉదయం నేను కూడా సోషల్ మీడియాలో చూసి తెలుసుకున్నాను. వెంటనే పూనమ్ సోదరి ఇంటికి వెళ్లి.. నిజమెంటో తెలుసుకుందామని ప్రయత్నించాను. కానీ, ఆమె నా ఫోన్స్ ఆన్సర్ చేయడం లేదు. అసలు నిజమేంటో తెలియాల్సి ఉంది. తన సోదరి రిప్లై కోసం ఎదురుచూస్తున్నాను. కొన్నిరోజుల క్రితం పూనమ్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అంతా నార్మల్ గానే కనిపించింది. ఆమె ఆల్కహాల్ తీసుకోవడం కూడా మానేసింది. అసలు నిజాలు తెలియాలంటే.. పూనమ్ సోదరి చెప్పాల్సిందే” అని చెప్పుకొచ్చాడు. మరి పూనమ్ సోదరి మీడియా ముందుకు వస్తుందేమో చూడాలి.
Also Read
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
- Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
- “ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
- Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
తాజావార్తలు
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..