NTV Telugu Site icon

Poonam Kaur: తప్పు చేసి.. ఎలా తప్పించుకోవాలో ఆయనకు బాగా తెలుసు .. పూనమ్ ఫైర్

Poonam

Poonam

Poonam Kaur: మాయాజాలం సినిమాతో పూనమ్ కౌర్ ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. స్వచ్ఛమైన నవ్వు.. అంతకు మించిన అందంతో ఈ భామ మంచి స్థాయికి వెళ్తుంది అనుకున్నారు. విజయాలు అందుకోకపోయినా.. అవకాశాలను అయితే అందిపుచ్చుకుంది. అయితే మధ్యలో ఏం జరిగిందో తెలియదు సినిమాలకు స్వస్తి చెప్పింది. దానికి ఎన్నో కారణాలు ఉన్నాకూడా వాటిని ఆమె బయటపెట్టలేదు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే వివాదాలతోనే ఆమె ఫేమస్ అయ్యింది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల గురించి మాట్లాడి మరింత గుర్తింపు తెచ్చుకుంది. కొద్దిగా గ్యాప్ దొరికినా సోషల్ మీడియాలో త్రివిక్రమ్ పై పూనమ్ ఫైర్ అవుతూ ఉంటుంది. ఇక తాజాగా మరోసారి మండిపడింది. ప్రస్తుతం త్రివిక్రమ్- మహేష్ కాంబోలో గుంటూరు కారం సినిమా వస్తుంది. ఈ సంక్రాంతికి గుంటూరు కారం రిలీజ్ కానుంది. మరి కొద్దిరోజుల్లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రంపై కొన్ని కాపీ ఆరోపణలు వచ్చాయి. ఈ చిత్రం స్టోరీ లైన్ ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచన రాణి రాసిన కీర్తి కిరీటాలు అనే నవల నుంచి కాపీ కొట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి.

ఇక ఈ విషయమై పూనమ్ స్పందించింది. “ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. దాన్నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా ఆయనకు బాగా తెలుసు. తన తప్పుడు పనులను ప్రజలకు కనబడకుండా జాగ్రత్తపడే నైపుణ్యం ఉన్నవాడు. కొందరు గుడ్డిగా ఆయనను నమ్మేస్తారు. ప్రజల సమస్యలు తీర్చడానికి ముందుకు రాని గత ప్రభుత్వం ఆయనకు మాత్రం బాగా సాయం చేసింది. అదెందుకో నాకిప్పటికీ అర్థం కాదు మరి” అంటూ గురూజీ థింగ్స్ అని చెప్పుకొచ్చింది. అంటే కాకుండా సీఎం కార్యాలయానికి ప్రత్యేక ప్రవేశం కూడా ఉంటుంది అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై త్రివిక్రమ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.