Site icon NTV Telugu

Poonam Kaur: ఒకరికి హీరో మరొకరికి విలన్.. హాట్ టాపిక్ గా పూనమ్ ట్వీట్

Poonam Kaur Abou Hero

Poonam Kaur Abou Hero

Poonam Kaur Tweet about Hero Goes Viral: సోషల్ మీడియా విరివిగా అందుబాటులోకి రావడంతో సెలబ్రెటీలు ఏ విషయాలు పంచుకున్నా వెంటనే వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా నటి పూనమ్ కౌర్ తన ట్విట్టర్ లో ఒక ట్వీట్ షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉంటున్న ఆమె ఒకరి జీవితంలో హీరో అయిన కొందరు మరొకరి జీవితంలో విలన్ కావచ్చని రాసుకొచ్చారు. సామూహిక ప్రయోజనం ప్రకారం వారి చుట్టూ నేరేటివ్ సృష్టిస్తారు అని అంటూ ఆమె పేర్కొంది. ఇక కొద్ది రోజుల క్రితం ఆమె త్రివిక్రమ్ ను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్లు కలకలం రేపాయి. ఒక ట్విట్టర్ వీడియో కింద పూనమ్ కౌర్ త్రివిక్రమ్ యూజ్లెస్ ఫెలో అని కామెంట్ చేసింది.

Premalu: మలయాళ సెన్సేషన్ ను తెలుగులో డబ్ చేస్తున్న రాజమౌళి కొడుకు

సాధారణంగా ఈ కామెంట్ చూసిన అందరూ అది ఫేక్ అకౌంటని, ఎవరో చేసిన కామెంట్ అని అనుకున్నారు. తీరా చూస్తే అది పూనమ్ కౌర్ ఒరిజినల్ అకౌంట్ కావడంతో త్రివిక్రమ్ పేరుని లాగుతూ ఆమె చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. నిజానికి పూనమ్ కౌర్ తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే. అందగత్తె, మంచి నటయినా సరే ఆమె ఎందుకో సక్సెస్ కాలేక పోయింది. అయితే నటిగా నిరూపించుకో లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఒక విషయం మీద స్పందిస్తూ ఉంటుంది. సినిమా అవకాశాలు అడపాదడపా వస్తున్నా ఆమె వాటిని చేస్తూనే మరో పక్క చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ చేనేత వస్త్రాలను ప్రమోట్ చేస్తూ వస్తోంది. ఇక హీరో విలన్ అంటూ ఆమె చేసిన ట్వీట్ కారణంగా మరో సారి వార్తల్లోకి ఎక్కింది.

Exit mobile version