Site icon NTV Telugu

Poonam Kaur: పవన్ తో నటించకుండా చాలామంది నన్నుఅడ్డుకున్నారు..

poonam kaur

poonam kaur

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కు నటి పూనమ్ కౌర్ కు మధ్య ఒక వివాస్పద ఎపిసోడ్ ఎప్పటినుంచో నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక ఎప్పుడు పూనమ్ మీడియా కంట పడ్డ పవన్ టాపిక్ ఎత్తకుండా మాత్రం వదలరు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో పలు సంచలన వ్యాఖ్యలు చేసిన అమ్మడు.. తాజాగా తన సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ భామకు మరోసారి పవన్ గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. పవన్ తో నటించారు కదా.. ఆయన గురించి చెప్పండి అని విలేఖరి అడగగా.. పూనమ్.. నేను చేయలేదు.. చేయనివ్వలేదు చాలామంది అంటూ ఎమోషనల్ అయ్యింది.. ఆయన గురించి ఏమి చెప్పినా వివాదమే అవుతుంది. పాజిటివ్ గా చెప్పినా నెగిటివ్ గానే అర్ధం చేసుకుంటారు. అయ్యయ్యో నాకు సిగ్గు వచ్చేస్తుంది! దేవుడా! అంటూ పూనమ్ నవ్వినా తీరు అందరిని ఆకట్టుకుంటుంది. కానీ పవన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడా అంటూ నవ్వేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version