NTV Telugu Site icon

Poonam kaur: జైల్లో చంద్రబాబు..అది గుర్తు చేస్తూ పూనమ్ కౌర్ ట్వీట్!

Poonam

Poonam

Poonam kaur Supports TDP Chief Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి చేశారు అనే ఆరోపణలతో సీఐడీ అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక తాజాగా చంద్రబాబు తరపున వేసిన క్వాష్‌ పిటిషన్‌తో పాటు మరో రెండు పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. క్వాష్‌ పిటిషన్‌పై విచారణను ఈ నెల 19కి వాయిదా వేసి ఈ నెల 18లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీని న్యాయస్థానం ఆదేశించింది. ఇక మరోపక్క ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌ను ఈ నెల 18 వరకు విచారించవద్దని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదిలా ఉండగా చంద్ర బాబుకు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే రాఘవేంద్ర రావు, పవన్ కళ్యాణ్, నారా రోహిత్, నట్టి కుమార్, అశ్వినిదత్ వంటి వారు బాబు అరెస్ట్ అన్యాయం అని ఆయనకు మద్దతు తెలుపగా ఇప్పుడు హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా చంద్రబాబుకు మద్దతుగా ట్వీట్ చేసింది.

Pallavi Prashanth: రైతు బిడ్డకి అఖిల్ సపోర్ట్.. అడుక్కుని వచ్చావంటారా?

ప్రజా జీవితంలో చాలా కాలం సేవలు అందించిన తరువాత 73 ఏళ్లు అనేది జైలులో ఉండే వయస్సు కాదు, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో జరుగుతున్న ఏ విషయాలకు నాకు అధారిటీ కానీ సంబంధం లేదు అయితే చంద్ర బాబు నాయుడు సార్ ఆరోగ్యాన్ని సంబంధిత వ్యక్తులు పరిగణించాలని మానవతా దృక్పథంతో విజ్ఞప్తి చేస్తున్నాను అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో చేనేత వస్త్రాలకు సంబంధించి పూనమ్ కౌర్ అంబాసిడర్ గా నియమించబడ్డారు. ఇక ఇదిలా ఉందా చంద్రబాబు సెక్యూరిటీ బస్సు రాజమండ్రి టిడిపి క్యాంప్ దగ్గరికి చేరుకోగా చంద్రబాబు కుటుంబ సభ్యులు ఉన్నన్ని రోజులు బస్సు ఇక్కడే ఉంటుందని నేతలు చెబుతున్నారు. మరికొద్ది రోజుల పాటు రాజమండ్రిలోనే భువనేశ్వరి ఉండే అవకాశం ఉందని తెలియడంతో సెక్యూరిటీ బస్సు తెప్పించినట్టు తెలుస్తోంది.