Poonam Kaur: బాలకృష్ణ చిన్నల్లుడిపై పూనమ్ కౌర్ షాకింగ్ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poonam Kaur Supporting Tweet to Balakrishna Son in Law Sri Bharath: నందమూరి బాలకృష్ణ ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క రాజకీయాల్లో కూడా బిజీ బిజీగా గడుపుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన ఇద్దరు అల్లుళ్ళు కూడా పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్నారు. పెద్దల్లుడు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వహిస్తూ జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి కూటమి బలపర్చిన తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇక రెండో అల్లుడు శ్రీ భరత్ కూడా విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా రెండోసారి బరిలోకి దిగారు. నిజానికి గీతం సంస్థల అధినేత ఎం ఎం వి ఎస్ మూర్తి మనవడిగా ఆయనకు మంచి పేరు ఉంది. కానీ 2019 ఎన్నికల్లో అప్పటి వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎం వి వి సత్యనారాయణ చేతిలో ఓటమిపాలయ్యారు.
Pawan Kalyan: నేను బ్రతికుండగా రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను
Also Read
అయినా సరే మరోసారి ఆయన లక్ పరీక్షించుకునేందుకు బరిలోకి దిగారు. కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా ఆయన పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి తరుణంలో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న హీరోయిన్ పూనం కౌర్ భరత్ ను ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సినారియో చూస్తుంటే బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ ఏదో సాధించేలాగే కనిపిస్తున్నాడని ఆమె ట్వీట్ చేసింది. విశాఖపట్నం నుంచి అతను గెలిచి పార్లమెంటుకు వెళితే అది చాలా అద్భుతంగా ఉంటుందని ఆమె పేర్కొంది. ఎడ్యుకేషన్ గురించి భవిష్యత్తు గురించి అతనికి ఉన్న విజన్ కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవ్వకూడదు అన్నట్టుగా ఆమె ట్వీట్ చేసింది. తాను భరత్ ను సపోర్ట్ చేస్తున్నట్టుగానే భావించాలని పేర్కొన్న ఆమె ఇది ఎవరూ డబ్బులు ఇచ్చి పెట్టించిన ట్వీట్ కాదు, అలాగే స్పాన్సర్ చేసిన ట్వీట్ కాదు అంటూ కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) May 4, 2024
తాజావార్తలు
-
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రోకు మేకోవర్.. 10 స్టేషన్లతో కొత్త ప్లాన్.!
-
Thota Trimurthulu: కాపులు గెలవకపోయినా గెలిపిస్తారు.. తోట త్రిమూర్తుల కీలక వ్యాఖ్యలు
-
CJP Protest: ఉద్యమం విద్యార్థులదా.? నేరస్తులదా.? ఢిల్లీ పోలీస్ రిపోర్టుల్లో సంచలన విషయాలు..
-
Tati Garelu: నోరూరించే సంప్రదాయ వంటకం..’తాటి గారెలు’ పర్ఫెక్ట్ కొలతలతో ఈజీగా తయారు చేసుకోండి!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ బ్యాట్ మళ్లీ గర్జించేది ఎప్పుడు? తదుపరి మ్యాచ్ ఎప్పుడు? అభిమానుల్లో ఆసక్తి
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!