NTV Telugu Site icon

Poonam: మీకు అంత అహంకారమా? పవన్ సినిమాపై సెన్సేషనల్ కామెంట్స్

Poonam

Poonam

పవన్ కళ్యాణ్‌ ఫాన్స్ కి, ఒకప్పటి హీరోయిన్ పూనమ్ కౌర్ మధ్య సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎదో ఒక విషయంలో రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు పవన్ అంటే చాలా ఇష్టమని ఓపెన్ గానే చెప్పిన పూనమ్ కౌర్ కి పవన్ ఫాన్స్ సపోర్ట్ బాగానే ఉండేది కానీ నెమ్మదిగా పరిస్థితులు మారిపోయాయి. పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా కామెంట్స్ చేసే పూనమ్ అప్పుడప్పుడూ ‘గురూజీ’ అంటూ ఇన్ డైరెక్ట్ గా త్రివిక్రమ్‌ పై కూడా కామెంట్స్ చేస్తే ఉంటుంది. ఈ కారణంగా పూనమ్ నుంచి ఏ ట్వీట్ వచ్చినా వెంటనే పవన్ ఫాన్స్ రిప్లై ఇచ్చేస్తూ ఉంటారు. “ఓ పెద్ద డైరెక్టర్” తనని ఎలా అవమానించాడో పూనమ్ కౌర్ చెప్పిన మాటలు అందరికీ తెలిసిందే.

ఈ ఇష్యూ చాలా రోజుల పాటు హాట్ టాపిక్ గా నిలిచింది. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో మళ్లీ పూనమ్ పేరు వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే పూనమ్, లేటెస్ట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా టైటిల్ పై పూనమ్ కౌర్ కామెంట్స్ చేసింది. “When u cannot respect revolutionaries atleast don’t insult them – a recent poster release for a movie – insults the name #bhagatsingh by placing it below foot – ego or ignorance?” అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. భగత్ సింగ్ లాంటి నాయకుడి పేరుని టైటిల్ పోస్టర్ లో, కింద పెట్టడం అనేది ఆ నాయకుడిని ఇన్సల్ట్ చెయ్యడమే. ఇది మీ ఈగోనా లేక నిర్లక్ష్యమా అంటూ పూనమ్ ఫైర్ అయ్యింది. పూనమ్ ట్వీట్ వైరల్ అవ్వడంతో, పవన్ ఫాన్స్ అటెన్షన్ సీకర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్ప్స్ కోసం వెయిట్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్న ఫాన్స్ ని పూనమ్ కౌర్ ట్వీట్ డిస్టర్బ్ చేసినట్లు ఉంది.