Site icon NTV Telugu

Poonam Kaur: నా మతం చూపించి తెలంగాణ నుంచి నన్ను వెలి వేస్తున్నారు.. కంటతడి పెట్టిన పూనమ్

Poonam

Poonam

Poonam Kaur: మాయాజాలం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ పూనమ్ కౌర్. సినిమాల కన్నా వివాదాలోతోనే ఎక్కువ ఫేమస్ అయినా ఈ భామ గతేడాది చివర్లో అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పి షాక్ ఇచ్చింది. ఫైబ్రో మాయల్జియా అనే వ్యాధి తో పోరాడుతున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. దీనికోసం కేరళలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇక పూనమ్ సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. రాజకీయాల గురించి కానీ, ప్రజా సమస్యల గురించి కనై తనదైన శైలిలో విమర్శిస్తూనే, ప్రశంసిస్తూనో చేసి నెటిజన్ల విమర్శలను అందుకుంటూ ఉంటుంది. ఇక తాజాగా పూనమ్ కౌర్ ఒక స్టేజిపైనే కంటనీరు పెట్టుకుంది. తనను తెలంగాణ నుంచి వేరు చేస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.

Tamilisai Sounderajan: నన్ను తిట్టిన వారికి అవార్డులిచ్చారు.. గవర్నర్ ధ్వజం

నేడు రాజ్ భవన్ లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలకు పూనమ్ హాజరయ్యింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తీవ్ర భావోద్వాగానికి గురు అయ్యింది. తన మతం ద్వారా తనను వేరు చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ” నేను తెలంగాణలో పుట్టాను.. ఇక్కడే పెరిగాను. కానీ నేను పంజాబీని అని, సిక్కుని అని.. మతం పేరు మీద నన్ను దూరం చేస్తున్నారు. నన్ను తెలంగాణ నుంచి దూరం చేయకండి.. నా మతం పేరు చెప్పి నన్ను వెలి వేయకండి. నేను తెలంగాణ బిడ్డనే..” అంటూ ఆమె స్టేజిపైనే కన్నీరు పెట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

https://www.youtube.com/watch?v=0Uz1BuBv7gk

Exit mobile version