Site icon NTV Telugu

Poonam Kaur: మూడు పెళ్లిళ్లు అంటూ వైసీపీ నేతకు పూనమ్ కౌర్ కౌంటర్!

Poonam Kaur On Guru

Poonam Kaur On Guru

Poonam Kaur Counter to YSRCP Leader over Three Marriages: పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా ఆయనకు ఎక్కువగా కౌంటర్లు ఇస్తూ వస్తున్న వివాదాస్పద నటి పూనం కౌర్. ఆసక్తికరంగా ఇప్పుడు వైసీపీ నేత ఒకరికి మూడు పెళ్లిళ్ల వ్యవహారంలో కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. నిజానికి పూనం కౌర్, పవన్ కళ్యాణ్ అలాగే త్రివిక్రమ్ మధ్య ఏం జరిగిందనే విషయం మీద క్లారిటీ లేదు, ఈ విషయం మీద అనేక ప్రచారాలు ఉన్నాయి. కానీ పూనం కౌర్ చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ పేర్లు తీసి కొన్నిసార్లు, తీయకుండా కొన్నిసార్లు విమర్శల వర్షం కురిపించింది. అయితే ఇప్పుడు మాత్రం ఆసక్తికరంగా ఒక వైసీపీ నేత ఆమె టార్గెట్ చేశారు. అసలు విషయం ఏమిటంటే ప్రదీప్ రెడ్డి చింత అనే ఒక ఎన్నారై వైసీపీ నేత గత కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.

Manjummel Boys: లవ్ లెటర్ టు మంజుమ్మల్ బాయ్స్

జనసేన పవన్ కళ్యాణ్ సహా టీడీపీ నేతలు మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఆయన టెస్లా కంపెనీ ఓనర్ ఎలా మస్క్ ను సోషల్ మీడియాలో టాగ్ చేసి తాను వాడేది టెస్లా కారు అని ఎక్స్ లో కూడా యాక్టివ్ యూజర్నే కాబట్టి ఈ విషయాలను కన్సిడర్ చేసి ఆంధ్రప్రదేశ్ టెస్లా షాప్ పెట్టాలని కోరారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెస్లా కంపెనీని ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించిన వార్తను కూడా షేర్ చేశారు. అయితే ఇదే ట్వీట్ ను రీట్వీట్ చేసిన పూనమ్ కౌర్ ఆయనకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి అయినా పర్వాలేదా అంటూ వైసీపీ నేతకి కౌంటర్ ఇచ్చారు. అయితే ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండే పూనం పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నేతలు దాడి చేసే మూడు పెళ్లిళ్ల అంశాన్ని ప్రస్తావిస్తూ అదే వైసీపీ నేతకు కౌంటర్ ఇవ్వడం ఏమిటా అనే చర్చ జరుగుతుంది.

Exit mobile version